తూర్పుగోదావరి

పరిశోధనా పటిమతో అటవీ నేరాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: అటవీ నేరాలను నిరోధించడంలోనూ, విధి నిర్వహణను మెరుగుపర్చుకోవడంలోనూ సిబ్బంది పరిశోధనా పటిమ, మేథాశక్తి ప్రధాన పాత్ర పోషిస్తాయని అటవీ శాఖ విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఎస్ నాగేశ్వరరావు అన్నారు. అటవీ నేరాల నిరోధం, నేర పరిశోధనలో మెళకువలపై అటవీ అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మంగళవారం ఫారెస్ట్ అకాడమిలో ప్రారంభమైంది. ఈ శిక్షణకు రీసోర్సు పర్సన్‌గా హాజరైన నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలోనూ పరిశీలన, పరిశోధనా శక్తులు ఉంటాయని, అయితే వీటిని నిర్మాణాత్మకంగా ఉపయోగంచుకోవడం పోలీసు, అటవీ తదితర శాఖల వారికి అవసరమన్నారు. పోలీసు పరిభాషలో ఏదైనా నేరానికి సంబంధించి అందిన సమాచాన్ని ఇంటిలిజెన్స్ అంటారన్నారు. ఈ సమాచారాన్ని సరైన రీతిలో విశే్లషించుకొని సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం వల్ల నేరాన్ని నిరోధించడం సాధ్యపడుతుందన్నారు. అటవీ అధికారులు పరిశోధనా పటిమను పెంచుకుని వ్యూహాత్మకంగా నేర నిరోధానికి పాటుపడటం ద్వారా ప్రకృతి వనరులను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఉద్బోధించారు. నిఘాలోని వివిధ పద్ధతులను, ఇన్‌ఫార్మర్ వ్యవస్థ తీరుతెన్నులను నాగేశ్వరరావు వివరించారు. పత్రికా కథనాల విశే్లషణ, రెక్కీ, హవాలా నగదు బదిలీ, క్రైమ్ రికార్డులు, హ్యూమన్ ఇంటిలిజెన్స్, టెక్ ఇంటిలిజెన్స్ తదితర తొలిరోజు శిక్షణలో నాగేశ్వరరావు సమగ్రంగా వివరించారు. మూడు రోజులపాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమాన్ని అటవీ అకాడమి అసెంబ్లీ హాల్లో డైరెక్టర్ జెఎస్‌ఎన్ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ జెఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ పరిశోధనా దృష్టి ఉన్నచోట విజయం ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలో పరిశోధనాత్మక దృక్పథం రామాయణం, భారతం వంటి ఇతిహాసాల్లో కూడా కన్పిస్తుందన్నారు. పరిశోధనాత్మక దృష్టిని, విశే్లషణా నైపుణ్యాన్ని సిబ్బంది అలవర్చుకుంటే విధి నిర్వహణలో వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని చెప్పారు. అటవీ శాఖ ఇంటిలిజెన్స్ డీఎఫ్‌వో ఆర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీట్, సెక్షన్ ఆఫీసర్లంతా పోలీసు శాఖలోని ఇంటిలిజెన్స్ అధికారుల మాదిరిగా వ్యవహరిస్తే అటవీ నేరాల నిరోధం సాధ్యపడుతుందన్నారు. దేశంలోనే ఏపీ పోలీసు శాఖ ఇంటిలిజెన్స్‌లో అగ్రస్థానంలో ఉందన్నారు. ఆ శాఖ అధికారుల సహకారంతో అటవీ సిబ్బందికి ఇంటిలిజెన్స్‌లో తగిన శిక్షణ ఇప్పించాలని భావించడం స్వాగతించదగిన పరిణామన్నారు. నేరం జరగకుండా ఆపడానికి, ఒక వేళ జరిగితే సత్వరం దోషులను దండించడానికి వీలయ్యే పరిశోధనాత్మక దృక్పథాన్ని, సామర్ధ్యాన్ని అటవీ సిబ్బందికి అలవర్చడమే ఈ శిక్షణ ఆంతర్యమని చెప్పారు. అటవీ అకాడమి డిప్యూటీ డైరెక్టర్ ఎంవి ప్రసాదరావు శిక్షణ ఉద్దేశాలను వివరించారు.
మంచి గుడ్లు వచ్చాయ్!
*‘ఆంధ్రభూమి’ కథనానికి స్పందన
గోకవరం, సెప్టెంబర్ 25: కుళ్లిన గుడ్ల స్థానే మంచి గుడ్లను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలకు నిర్వాహకులు అందజేశారు. ఈ నెల 25న ఆంధ్రభూమి జిల్లా అనుబంధంలో ‘గోకవరం హైస్కూల్లో కుళ్లిన కోడి గుడ్లు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈ కథనానికి కోడి గుడ్ల సరఫరా నిర్వాహకులు స్పందించి కుళ్లిన కోడి గుడ్ల స్థానే మంచి కోడి గుడ్లను పాఠశాలకు అందజేశారు. ఈ విషయాన్ని ఆ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. కుళ్లిన వెయ్యి కోడి గుడ్ల స్థానే మంచి కోడి గుడ్లను అందజేసినట్టు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలా కుళ్లిన గుడ్లకు బదులు మంచి కోడి గుడ్లు అందజేయలేదన్నారు.