తూర్పుగోదావరి

నగరం తరహా ఘటనలు పునరావృతం కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఏప్రిల్ 30: కోనసీమలో నగరం గ్యాస్ దుర్ఘటనలు వంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు, దీనికోసం తొమ్మిది చోట్ల రూ.540 కోట్లతో గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్లు (జిడియు) ఏర్పాటుచేస్తున్నట్టు అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు వెల్లడించారు. శనివారం సాయంత్రం రావులపాలెం టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోనసీమ నుండి గ్యాసును తరలిస్తున్న ఒఎన్జీసీ, గెయిల్ సంస్థల ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.60లక్షలు కేటాయించి ఇంత వరకూ అయిదు గ్యాసు కనెక్టింగ్ స్టేషన్ల వద్ద జిడియుల ఏర్పాటు పూర్తయిందన్నారు. త్వరలో మరో నాలుగు చోట్ల ఏర్పాటు చేయనున్నట్టు ఎంపి తెలిపారు. గ్యాసు ఉత్పత్తి జరిగేటప్పుడు గ్యాసులో తేమ, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి ఉండడం వల్ల పైపులైన్లు తుప్పు పడతాయన్నారు. దీనివల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని, ఈ సమస్య లేకుండా జిడియుల ద్వారా గ్యాసును డీహైడ్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే పాత పైపులైన్లను తొలగించినట్టు తెలిపారు. కోనసీమలోని రావులపాలెం మీదుగా వెళుతున్న 16వ నెంబరు జాతీయ రహదారి భవిష్యత్తులో ఎన్‌హెచ్ హోదా కోల్పోయి స్టేట్ హైవేగా మారే అవకాశం ఉందన్నారు. గుండుగొలను నుండి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వరకూ ఉన్న జాతీయ రహదారి వచ్చే రెండేళ్లల్లో అభివృద్ధి పనులు పూర్తయితే రావులపాలెం మీదుగా ఉన్న రహదారికి ఎన్‌హెచ్ హోదా తగ్గించాలన్న ప్రతిపాదనలు వెళ్లాయని, అయితే ఎన్‌హెచ్ హోదాను తగ్గించకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఈతకోట వద్దనున్న టోల్ గేట్ కూడా రెండేళ్ల తర్వాత తీసివేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కోటిపల్లి- నర్సాపురం రైల్వేలైనుకు సంబంధించి కేంద్ర బడ్జెట్టులో రూ.200 కోట్లు కేటాయించినప్పటికీ ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి వెయ్యి కోట్లు సిద్ధంగా ఉన్నట్లు ఎంపి తెలిపారు. జూలై రెండవ వారంలో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. 2017 నాటికి అమలాపురం వరకూ పనులు పూర్తవుతాయని చెప్పారు. 2018-19 నాటికి రైల్వే లైను పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఈ పనులకు నిధుల కొరత లేదని, టెండర్ల ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈ రైల్వే లైనులో భాగంగా నిర్మించే వంతెనలను రోడ్డుకంరైల్వే వంతెనలుగా నిర్మించే అవకాశాలు లేవన్నారు. ఈ విధానంలో నిర్మించిన వంతెనలు ప్రపంచంలో ఎక్కడా మంచి ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నాలను ఎక్కడా చేయడం లేదన్నారు. రాజమండ్రి- కొవ్వూరు బ్రిడ్జిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చునన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట ఎఎంసి ఛైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు గుత్తుల పట్ట్భారామారావు, పెచ్చెట్టి చిన్నారావు పాల్గొన్నారు.