తూర్పుగోదావరి

వైభవోపేతంగా భీమేశ్వరుని తెప్ప మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 28: పవిత్ర కార్తీక మాసంలో భాగంగా స్థానిక పంచారామక్షేత్రంలోని భీమేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం (ఆరుద్రా)ను పురస్కరించుకుని శనివారం రాత్రి స్వామివారి ఆలయ కోనేరులో తెప్ప మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కోనేరు వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ పుష్కరిణి గట్టు వద్ద వేదికపై ఉంచి తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ ప్రత్యేక పూజలను ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ తదితర ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం స్వామివారి అమ్మవారి విగ్రహాలను సుందరంగా విద్యుత్ అలంకరణలతో రూపొందించిన తెప్పపై అధిష్టించి ఘనాపాఠీ శ్రీపాద రాజశేఖర శర్మ, అభిషేక పండిట్ వేమూరి సోమేశ్వరశర్మ, అర్చకులు కొంతేటి జోగారావు, సన్నిధిరాజు వెంకన్న, సుబ్బన్న, లచ్చన్న, చెరకూరి రాంబాబు తదితరులు మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల భద్రతా ఏర్పాట్లను పెద్దాపురం సిఐ కె శ్రీ్ధర్‌కుమార్, ఎస్సైలు ఆకుల మురళీకృష్ణ, వై సతీష్‌లు పర్యవేక్షించారు.
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ద్వారా అధిక ఆదాయం
సిపిసిఆర్‌ఐ
డైరెక్టర్
చౌడప్ప
అంబాజీపేట, నవంబర్ 28: కొబ్బరి ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తే రైతులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని సిపిసిఆర్‌ఐ (కాసరగడ్, కేరళ) డైరెక్టర్ డాక్టర్ పి చౌడప్ప అన్నారు. అంబాజీపేట మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన కొబ్బరి రైతుల సదస్సు జరిగింది. కొబ్బరిలో అంతర పంటల సాగు, మూల్యవృద్ధిపై జరిగిన ముఖాముఖి సమావేశంలో చౌడప్ప మాట్లాడుతూ పచ్చి కొబ్బరినుండి పాలు తీసే పరిశ్రమలు ఏర్పాటుచేస్తే పశువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించు కోవచ్చన్నారు. ఇప్పటికే యూరప్ దేశాలలో ఈ పాలను వినియోగిస్తున్నారని, దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని రుజువైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1.5 లక్షల హెక్టార్లలో కొబ్బరిసాగు అవుతుండగా కేవలం కోనసీమలో సుమారు లక్ష హెక్టార్లు ఉందన్నారు. కొబ్బరి ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నేటికీ సాంప్రదాయ పద్ధద్దతులనే వాడటం ఈ పరిస్థితికి కారణమన్నారు. ఇందుకు రైతులు విలువ ఆధారిత ఉత్పత్తులను చేస్తూ కొబ్బరి అనుబంధ పరిశ్రమల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఎకరం కొబ్బరితోటలో కల్పరస తయారు చేస్తే సాలుకు 1.5 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చన్నారు. కల్పరస తయారీకి ఆబ్కారీ శాఖనుండి అనుమతి పొందాలన్నారు. దేశంలో ప్రధానంగా నాలుగు రాష్ట్రాలలో కొబ్బరి 90 శాతం ఉత్పత్తి అవుతోందని, 94 శాతం ఉత్పాదన ఉన్నప్పటికీ కేవలం ఆరు శాతం మాత్రమే విలువ ఆధారిత వస్తువులు తయారవుతున్నాయన్నారు. ఈ మొత్తం 30 శాతం నుండి 40 శాతానికి పెరగాలన్నారు. ఈ వృద్ధికి సిపిసిఆర్‌ఐతో పాటు సిడిబిలు సహాయం చేసేందుకు సిధ్దంగా వున్నాయన్నారు.సిపిసిఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్ నిర్ణయం తీసుకోవాల్సివుందన్నారు. ఈ సదస్సులో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, సిడిబి డిప్యూటీ డైరెక్టర్ జయనాధ్, సభ్యులు జవహర్‌ఖాన్, ఎఎంసి ఛైర్మన్ అరిగెల బలరామమూర్తి, జడ్పీటీసీ బొంతు పెదబాబు, సొసైటీ అధ్యక్షులు గణపతి వీరరాఘవులు, ఎంపిపి డివివి సత్యనారాయణ, సర్పంచ్ సుంకర సత్యవేణి, బికెఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమీల్, జిల్లా అధ్యక్షులు దొంగ నాగేశ్వరరావు, పూర్వాంధ్ర అధ్యక్షులు ఉప్పగంటి భాస్కరరావు, జలగం కుమారస్వామి, మద్దింశెట్టి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు బాలికల ఆత్మహత్యాయత్నం
కూనవరం, నవంబర్ 28: ముగ్గురు బాలికలు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కూనవరం మండలం ముల్లూరు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముల్లూరుగ్రామంలో ముగ్గురు బాలికలు కూలి పనులు చేసుకుంటున్నారు. వీరు ఒక వ్యక్తితో సోదరభావంతో సన్నిహితంగా ఉండటాన్ని భరించలేని ఒక బాలిక అన్న ఆ ముగ్గురు బాలికలను గట్టిగా మందలించాడు. దీంతో ఆ బాలికలు తీవ్ర మనస్తాపానికి గురై పురుగుమందు తాగడంతో, ఆ ముగ్గురు బాలికలు అపస్మారక స్థితికి చేరుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108లో కూనవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికల పరిస్థితి నిలకడగా ఉండడంతో శనివారం ఉదయమే వారిని స్వగ్రామానికి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఎస్సై రాజేష్‌కుమార్‌ను వివరణ కోరగా, దీనిపై ఎటువంటి సమాచారం లేదని తెలిపారు.
క్రైస్తవ సమాధుల స్థలం కోసం మరో ఉద్యమం
రాజమండ్రి, నవంబర్ 28: రాజమండ్రిలో పెద్ద సమస్యగా మారిన క్రైస్తవుల సమాధుల స్థలం కోసం మరోసారి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నానని బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు చెప్పారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను 2013లో 50రోజుల పాటు నిరవధిక దీక్ష చేపట్టగా స్పందించిన కమిషనర్ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులు స్థలం కోసం రూ. కోటి నిధులు మంజూరయ్యేలా కృషిచేశారన్నారు. ఎమ్మెల్యే రౌతు తన నిధుల నుంచి కోటిని విడుదల చేశారన్నారు. అయితే అప్పటి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జెసి ఆర్ ముత్యాలరాజు ఒక ఎకరం స్థలం కొనుగోలుకే ఆమోదం తెలిపారన్నారు. అప్పటికీ ఎకరం రూ. 35లక్షల మాత్రమే ఉందని, దీంతో మిగిలిన నిధులు ఏమయ్యాయన్న అనుమానం తలెత్తుతోందన్నారు. ప్రత్యేక అధికారి పాలనలో జరిగిన తీర్మానాలు, ఆమోదాలపై విచారణ జరిపించాలని, ఈమేరకు కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని కొండబాబు డిమాండ్ చేశారు. నగర బిఎస్పీ అధ్యక్షురాలిగా బర్రే అనుహెలినియాను నియమించినట్లు ఆయన ప్రకటించారు.