తూర్పుగోదావరి

పకడ్బందీగా జనసేన కవాతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: జనసేన సోమవారం నిర్వహించనున్న కవాతుకు దాదాపు రెండు లక్షల మంది రావచ్చని అంచనా.. అంచనాలకు మించి కూడా జనం రావొచ్చని నేతలు పేర్కొంటున్నారు. జనసేన కవాతుపై అధినేత పవన్‌కళ్యాణ్ ఆదివారం సమీక్షించారు. గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ మహశయుడు నిర్మించిన బ్యారేజిపై సోమవారం జనసేన భారీ ఎత్తున కవాతు కార్యక్రమం నిర్వహిస్తోంది. పిచ్చుకలంకలో మధ్యాహ్నం మూడు గంటలకు కవాతు మొదలవుతుంది. కవాతు రెండున్నర కిలోమీటర్ల మేర ధవళేశ్వరం వరకు చేరేందుకు గంటన్నర పడుతుందని అంచనా వేశారు. ఇరవై మీటర్ల వెడల్పున వుండే కాటన్ బ్యారేజి బ్రిడ్జిపై ఫుత్‌పాత్‌లు ఎక్కకుండా జనాన్ని స్వీయ నియంత్రణ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్ధలి వరకు కవాతు వుంటుంది. సభలో పవన్ కళ్యాణ్ కవాతు లక్ష్యాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకీ జవాబుదారీతనం అనేది లేదని, ఇకపై జవాబుదారీతనం లేని రాజకీయాలను అంగీకరించే ప్రసక్తే లేదని పవన్‌కళ్యాణ్ ఈ వేదిక నుంచి చెప్పదల్చుకున్నారని నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలకు తప్పకుండా పాలకులు కట్టుబడి వుండాల్సిందేనని, ఆ హామీలను నెరవేర్చకపోతే ప్రజలకు హేతుబద్ధమైన కారణాలు వివరించాల్సిందేనని, నవ శకం రాజకీయాలు, జవాబుదారీతనం వున్న రాజకీయ విధానాలు, రీకాల్ చేసే విధానం తదితర అంశాల ఆవశ్యకతను ఈ కవాతు ద్వారా తెలియజేయనున్నట్టు చెబుతున్నారు. రాజకీయ పెనుమార్పులకు ఈ కవాతు నుంచే శ్రీకారం చుట్టే విధంగా సంస్థాగత కార్యాచరణ చేపట్టారు. ఈ కవాతుకు 13 జిల్లాల నుంచి జనసైనికులు తరలివస్తారు. వీరమహిళా విభాగం కార్యకర్తలు ఈ కవాతులో పాలుపంచుకుంటారు. వివిధ కుల వృత్తుల ప్రాధాన్యత తెలియజేస్తూ, ఇప్పటివరకు పాలకుల నిర్లక్ష్యంతో తమ వృత్తులు ఏ విధంగా మసకబారాయో వివరించనున్నారు. వివిధ సాంస్కృతిక, సంప్రదాయాల మధ్య కళారూపాలతో కవాతులో పాల్గొంటారు. కవాతుకోసం ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్ర్తీ రాసిన ఈ గేయానికి సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూర్చారు. ఈ గీతం ప్రారంభంలోనూ, మధ్యమధ్యన పవన్ కళ్యాణ్ కొన్ని కవితలు విన్పించారు. ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్రశర్మ రాసిన రాహువు పట్టిన పట్టు వంటి కవితలు ఇందులో వున్నాయి. ప్రజలను ఉత్తేజితుల్ని చేసేలా, గమ్యాన్ని నిర్దేశించేలా ఈ గీతం సాగనుందని చెబుతున్నారు.
కాటన్ బ్యారేజిపై చేపడుతున్న కవాతు సందర్భంగా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కవాతు ఏర్పాట్లను ఆదివారం సమీక్షించారు. కవాతుకు హాజరైన ప్రతీ జనసైనికుడు క్షేమంగా ఇంటికి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులకు సూచించారు. రక్షణ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. కవాతుకు ఎంత ఆనందంగా వస్తారో, అంతకంటే ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళాలన్నారు. రూట్ మ్యాప్‌ను మరోసారి పరిశీలించారు. బ్యారేజి పొడవునా, సభ జరిగే చోట ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన 2 వేల మంది జనసేన కార్యకర్తలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. పార్టీకి చెందిన ఆజాద్ యూత్ వింగ్‌కు చెందిన కార్యకర్తలకు సందీప్ పంచకర్ల అనే యువకుడు శిక్షణ కల్పించారు.
కాటన్ బ్యారేజి బ్రిడ్జి 30 మీటర్ల వెడల్పు వుంటుంది. ఫుట్‌పాత్‌లు పోను 20 మీటర్ల వెడల్పు వుంటుంది. ఫుట్‌పాత్‌లు ఎక్కవద్దని నాయకులు విజ్ఞప్తి చేశారు. గత ఈతగాళ్ళను, అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. సభాస్థలి వద్ద సంప్రదాయ దుస్తులతో పార్టీ రంగు చీరలు ధరించి వీర మహిళలు స్వాగతం పలుకుతారు. విజ్జేశ్వరం వద్ద నాలుగు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. వాహనాలు పార్క్ చేసి అక్కడ నుంచి పిచ్చుకలంక వరకు దాదాపు ఆరేడు కిలోమీటర్లు నడవాల్సి వుంటుంది కాబట్టి 10 నుంచి 15 ఆటోలు ఏర్పాటు చేశారు. ఈ ఆటోలు షటిల్ సర్వీస్ చేస్తాయి. నడిచి రాగలిగినవారు నడిచి చేరుకుంటే, కాస్తంత వయోవృద్ధులవంటివారు ఆటోలు ఎక్కుతారని ఈ ఏర్పాటు చేశామంటున్నారు. వేమగిరి, ధవళేశ్వరం, చెరుకూరి కృష్ణాజీ గ్రౌండ్స్, ఖాళీగా వున్న పెట్రోల్ బంక్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు టూర్ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్ చెప్పారు. యువశక్తి మెండుగా వున్న పార్టీ కాబట్టి బైక్ పార్కింగ్‌కు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యలో, పార్కింగ్ ప్రదేశాల వద్ద ఫుడ్ ప్యాకెట్లు, మంచినీళ్ళు, మజ్జిగ సరఫరాకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. పార్టీ కేంద్ర బృందం, క్షేత్ర బృందం సమిష్టి కృషితో కవాతుకు ఏర్పాట్లు చేశామని నాయకులు కందుల లక్ష్మీదుర్గేష్, అత్తి సత్యనారాయణ, మేడా గురుదత్త ప్రసాద్, శెట్టిబత్తుల రాజబాబు, గంటా స్వరూప, కొల్లివెలసి హారిక, వై శ్రీనివాస్ చెప్పారు. మూడు గంటలకు కవాతు మొదలైతే, నాలుగున్నర గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుంటుందని, ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రత్యేక వాహనంపై అభివాదం చెబుతూ మోరంపూడి జంక్షన్ వరకు సాగుతారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ విజయవాడ వెళతారు. దసరా తర్వాతే జిల్లా పర్యటన ఖరారు కానుంది. పార్టీలో పలువురు నేతల చేరికలన్నీ జిల్లా పర్యటనలోనే వుంటాయని అంటున్నారు.

అపరిచిత ఫోన్ కాల్స్‌తో తస్మాత్ జాగ్రత్త!
అయినవిల్లి, అక్టోబర్ 14: ఒక అపరిచిత వ్యక్తి నుండి వచ్చిన ఫోన్‌కు ఆధార్, ఏటీఎం నెంబర్లు చెప్పడంతో బ్యాంకు ఖాతా నుండి రెండువేల రూపాయలు మాయమైపోయాయి. తరచు ఇటువంటి మోసాలు జరుగుతున్నప్పటికీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మోసపోతూనే వున్నారు. వివరాల్లోకి వెళితే... అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన భీమయ్య అనే వ్యక్తికి ఆదివారం ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఏటిఎం కార్డు చివరి రెండు నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్ చెప్పమని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తికి వివరాలు ఇవ్వడంతో ఆ వెంటనే పది నిమిషాల్లో భీమయ్య ఎస్‌బిఐ ఖాతా నుండి రెండువేలు విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో భీమయ్య లబోదిబోమన్నాడు. తన బావమరిది రూ. లక్ష తన అకౌంట్‌లో వేస్తానని చెప్పాడని, సోమవారం వేయమని చెప్పినట్టు భీమయ్య చెబుతున్నాడు. ఒకవేళ రూ.లక్ష తన అకౌంట్‌లో ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నాడు. దీనిపై అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో తెలియజేయగా అపరిచిత వ్యక్తులకు ఆధార్ నెంబర్లు ఇవ్వవద్దని అయినవిల్లి ఎస్సై జానీ బాషా సూచించారు. బ్యాంకు అధికారులు ఎవరూ ఏటిఎం నెంబర్లు, ఆధార్ నెంబర్ ఫోన్‌లో అడగరని, సైబర్ నేరస్తులే ఇటువంటి పనులు చేస్తారని అన్నారు. అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మండల ప్రజలకు ఎస్సై సూచించారు.