తూర్పుగోదావరి

ఊట పల్లంలో నిర్మిస్తున్న పునరావాస ఇళ్లు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం, నవంబర్ 17: ఊట పల్లంలో నిర్మిస్తున్న పునరావాస ఇళ్లు వద్దని గిరిజనులు ఆందోళన చేపట్టారు. దేవీపట్నం మండలంలోని ఇందుకూరు-1 ఇందుకూరు-2లో నిర్మిస్తున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు బాధితుల పునరావాస కాలనీ నిర్మాణ పనుల పరిశీలనకు శనివారం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు వస్తున్నారని తెలిసి పోలవరం నిర్వాసితులు, మంటూరు పంచాయతీ పరిధిలోని మడుపల్లి, పెనికలపాడు గ్రామాలకు చెందిన బాధితులు పెదవేంపల్లిలో నిర్మిస్తున్న కాలనీ ప్రాంతానికి చేరుకున్నారు. కలెక్టర్ వచ్చే సమయానికి రోడ్డుపై బైఠాయించి తమ పునరావాస సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కలెక్టర్ కాన్వాయ్ ఆగకుండా ముందుకు పోవడంతో మడుపల్లి గ్రామానికి చెందిన తోకల అమ్మన్న అనే 60 ఏళ్ల మహిళ కాలు పైనుంచి కారు వెళ్లిపోయిందని, కాలు నుజ్జునుజ్జయ్యిందని బాధిత మహిళతోపాటు బాధితులు తెలిపారు. అనంతరం కలెక్టర్ కారు దిగి పరిస్థితిని గమనించి వెంటనే ఇందుకూరు-1లో కాలనీ నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. గాయపడిన మహిళను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు, బాధితులు మడి అప్పన్నదొర, కురసం వెంకన్నదొర, ఎం నాగమణి మాట్లాడుతూ రెండేళ్ల నుంచి తమకు ఇళ్ల కోసం సేకరించిన భూమి ఊట భూమి అని ఎన్నిసార్లు అధికార్లకు మొరపెట్టుకున్నా భూ సేకరణ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి భూసేకరణ చేశారని, ఇప్పుడు తమ అభిప్రాయాలను తెలుసుకోకుండా కాలనీలను నిర్మిస్తున్నారని, తమకు ఇష్టంలేని నివాసయోగ్యంకాని ఊట భూములు తమకు వద్దని వారు కోరారు. జిల్లా కలెక్టర్‌కు ఈ విషయాలు విన్నవించేందుకు ప్రయత్నిస్తే ఆయన వెళ్లిపోయారని బాధితులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ అవినీతి అధికార్లకు వత్తాసుపలుకుతూ పోలవరం నిర్వాసిత గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వం నిర్మించే ఇళ్లను తాము తీసుకోమని, తాము అవసరమైతే కొండలపై పాకల వేసుకుని తమను దౌర్జన్యంగా తరలించిన తరువాత ఉంటామని బాధితులు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులను సర్వనాశనం చేస్తున్నారని, గిరిజన అవసరాలు, గిరిజన సంప్రదాయాలు, గిరిజనుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడంలేదని నిర్వాసితులు ఆరోపించారు. నిర్మాణ ప్రాంతానికి నిర్వాసితులు రాకుండా పోలీసు బలగాలతో దౌర్జన్యంగా కాపలా కాయిస్తున్నారని బాధితురాలు నాగమణి ఆరోపించారు. తమకు ఇష్టంలేని కాలనీ నిర్మిస్తున్న అధికార్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తామని నాగమణి తెలిపారు.