తూర్పుగోదావరి

సంక్రాంతి నాటికి గృహప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 17: వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ నూతన గృహ ప్రవేశం చేసేందుకు వీలుగా గృహ సముదాయాల పనులు పూర్తిచేస్తున్నామని, లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. సామర్లకోట మున్సిపాల్టీ పరిధి జగ్గమ్మగారిపేటలో 634, పిఠాపురం రోడ్డులోని ఉప్పువారి సత్రం ఎదురుగా 634 వెరశి 1048 ప్లాట్లను రూ.78.72 కోట్లు వ్యయంతో టిడ్కో ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించారు. వాటిని నగదు చెల్లించిన లబ్ధిదారులకు ప్లాట్లను లాటరీ ద్వారా శనివారం కేటాయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి రాజప్ప మాట్లాడుతూ అందరికీ ఇళ్ళు కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. భవిష్యత్తులో కూడా రెండో విడతలో మరిన్ని ప్లాట్లు నిర్మించనున్నట్టు చెప్పారు. మొత్తం ప్లాట్లను మూడు కేటగిరీలుగా రూ.500, రూ.50,000లు, రూ.1,00,000లుగా వర్గీకరించారు. స్థానికంగా ఉన్న ఇద్దరు యువతులను మంత్రి రాజప్ప వేదిక పైకి ఆహ్వానించి, డ్రా పద్ధతిని వారితో నిర్వహింపచేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప మాట్లాడుతూ ఎవరి ప్రమేయం లేకుండా ఇరువురు లబ్ధిదారులతో ఈ లాటరీ కేటాయింపు చేపట్టామని, కేటాయింపులపై ఎటువంటి విమర్శలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఎటువంటి ఇటుకలు ఉపయోగించకుండా మొత్తం సిమెంటు, కాంక్రీట్, ఐరన్‌తో ఈ గృహాలు షేర్‌వాల్ టెక్నాలజీలో నిర్మించినట్టు చెప్పారు. బాత్ రూమ్‌లలో సైతం ఖరీదైన టైల్స్ వేయించినట్లు చెప్పారు. గృహ సముదాయాల వద్ద త్వరలో రోడ్లు, విద్యుత్, డ్రెయిన్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. లాటరీలో ప్లాట్లు పొందిన లబ్ధిదారులు వెంటనే విద్యుత్ కనెక్షన్‌లు, బ్యాంక్ పనులు ప్రారంభించుకోవాలని సూచించారు. వికలాంగులు, వృద్ధులకు కింది వరుసలో ప్లాట్ల కేటాయింపు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వేర్వేరు వార్డులకు చెందిన వి నళినిశ్రీ, రిమ్మలపూడి అనంతలక్ష్మి అనే ఇద్దరు మహిళలను సభాప్రాంగణం నుండి మంత్రి రాజప్ప ఎంపిక చేసి వారి ద్వారా డ్రా పద్ధతిన ప్లాట్ల కేటాయింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడ్కో ఇన్‌చార్జి విసిహెచ్ అప్పలనాయుడు, బ్యాంక్ కో-ఆర్డినేటర్ శివప్రసాద్, హౌసింగ్ డీఈ వై శ్రీనివాసరావు, ఏఈ ఎల్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు, డీఈ సిహెచ్ రామారావు, టీపీఎస్‌లు మంజుల, రమ్య, టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), పట్టణ టీడీపీ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్, టీడీపీ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, వందలాది మంది లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు.
సహాయ పునరావాస ప్యాకేజీ ద్వారా
నిర్వాసితులకు స్థిరత్వం కల్పిస్తాం
*జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
దేవీపట్నం, నవంబర్ 17: పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న గిరిజనుల సంస్కృతిని, ప్రస్తుత భవిష్యత్, భావితరాల జీవనోపాధి, భద్రతకు అత్యంత శ్రద్ధ కనబరుస్తూ మానవీయమైన స్థిరత్వాన్ని సహాయ పునరావాస ప్యాకేజీ ద్వారా నిర్వాసితులకు అందిస్తామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని ఇందుకూరు-1 పునరావాస కాలనీలో పర్యటించి నిర్మాణ పనుల నిర్వహణను పరిశీలించారు. నిర్వాసితుల అభీష్టం మేరకే వారికి అనుగుణంగా వారు ఎంపిక చేసుకున్న ఆకృతుల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన అన్నారు. నిర్వాసితులెవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదని, టౌన్‌షిప్ మాదిరిగా అన్నిరకాల వసతులు, అన్ని హంగులతో పునరావాస కాలనీ నిర్మిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పునరావాస కాలనీలో వౌలిక సదుపాయాలైన సురక్షితమైన మంచినీరు, ఇంటింటికీ కుళాయి, సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా సీసీ డ్రెయిన్లతో వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాలనీని అందంగా తీర్చిదిద్దేందుకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. కమ్యూనిటీహాలు, జీసీసీ డీఆర్ డిపో, ఫెర్టిలైజర్స్ కాంప్లెక్స్, పోస్ట్ఫాసు, దేవాలయం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం తదితర వౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. మంటూరు, అగ్రహారం, ఏనుగురేవు నిర్వాసితుల కోసం 306 కుటుబాల కోసం ఈ కాలనీ నిర్మిస్తున్నామని తెలిపారు. గృహనిర్మాణం కోసం నిర్మిస్తున్న ఫిల్టర్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి మరింత నాణ్యతతో గృహాలు నిర్మించాలని గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణాలను టౌన్‌షిప్ మాదిరిగా నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్, సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్, స్థానిక తహసీల్దార్ ఎస్ సత్యనారాయణమూర్తి, హౌసింగ్ డీఈ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు రిపబ్లిక్ డే పెరేడ్‌కు ఆరుగురు ఎంపిక
*వీసీ ఆచార్య ముత్యాలనాయుడు

రాజమహేంద్రవరం, నవంబర్ 17: ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్‌కు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ విభాగానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. శనివారం యూనివర్సిటీలోని ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్‌కు ఎంపికైన విద్యార్థులు వీసీని కలిశారు. ఈ సందర్భంగా వీసీ వారిని అభినందించారు. ఎంపికైన బి సౌమ్య, పి నాని, జి కోటేశ్వరరావు (నన్నయ క్యాంపస్), ఎం హేమాభవానీ (ఎస్‌కెఎస్‌డి ఉమెన్స్ కాలేజి, తణుకు), పి బాలాకుమారి (ఆదిత్య కాలేజి), ఎ గంగరాజు (కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజి)లను వీసీ అభినందించారు.
భారతదేశంలో ఐదు జోన్ల వారీగా ఈ ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్‌కు నన్నయ విద్యార్థులు హాజరవుతున్నారని వీసీ ముత్యాలనాయుడు తెలిపారు. ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు శిక్షణ అనంతరం రిపబ్లిక్ డే పెరేడ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఈ విద్యార్థులు యూనివర్సిటీ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా కృషిచేయాలన్నారు. వీసీతో పాటు రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ కిరణ్ చంద్ర, కొత్తపేట కాలేజి ప్రిన్సిపాల్ పాపయ్య శాస్ర్తీ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా.రాజేంద్రప్రసాద్, డా.లక్ష్మీనారాయణ, డా.ర్ జానకీరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు.