తూర్పుగోదావరి

2.3 8హెక్టార్లలో రబీ సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 4: జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో 2.38హెక్టార్లలో వివిధ పంటలను సాగుచేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన వ్యవసాయ అనుబంధ శాఖల ప్రగతిని సమీక్షించారు. రబీ సాగును వెంటనే చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని, దీని ద్వారా కాలువలు మూసే సమయానికి నిర్దేశించిన విధంగా రైతులు దిగుబడులు సాధించడానికి వీలవుతుందన్నారు. రబీలో చేపట్టే 1.63లక్షల హెక్టార్లలో వరిసాగు నేరుగా విత్తనాలను చల్లే విధానాన్ని వ్యవసాయశాఖ అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 2.22లక్షల హెక్టార్లలో వరిని పండించగా 2.04లక్షల హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు 13.76లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహంలో భాగంగా రైతులకు నిర్దేశించిన రైతు రథం ట్రాక్టర్ల పంపిణీని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో 2,49,012 మంది లైతులకు 3,251 కోట్ల పంట రుణాలు అందించినట్లు కలెక్టర్ మిశ్రా తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని 36క్లస్టర్లలో అమలు చేశామని, ఈ విధానాన్ని మరింత విస్తరింపచేయాలని ఆయన ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్దేశించిన 47 గోకులాలు, వెయ్యి మినీ గోకులాల నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. అదే విధంగా పశువుల్లో ఏలిక పాము నిర్మూలన, టీకాలు, కృత్రిమ గర్భోత్పత్తి విధానాల లక్ష్యాలను సాధించాలని సూచించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట నిషేద సమయంలో 20,500 మంది మత్స్యకారులకు 8.2 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించడానికి 3,651 మత్స్యకారులకు 17కోట్లతో ప్రత్యేక పథధకాలు అమలుచేస్తున్నామని వివరించారు. ఉద్యానవన శాఖలో పోలీహౌడ్ నెట్స్ 43.8 లక్షలు లక్ష్యం కాగా 57,432మంజూరు చేశామని, వీటిని నెలాఖరుకు పూర్తిచేయలని ఆధికారులను కలెక్టర్ మిశ్రా ఆదేశించారు. సమావేశంలో జేసి-2 సిహెచ్ సత్తిబాబు, డిఆర్‌ఒ ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడి కెఎస్‌వి ప్రసాద్, పశుసంవర్ధకశాఖ జేడి శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడి వి వెంకటేశ్వరరావు, ఉద్యానవనశాఖ పిడి ఎస్ రామ్మోహెన్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమిపూజ
కాకినాడ సిటీ, డిసెంబర్ 4: జిల్లా పరిషత్ కూడలిలో సుమారు 40లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న జడ్పీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కలెక్టర్ కార్తికేయ మిశ్రా మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో జిల్లాపరిషత్‌కు ఆదాయం పెరుగుతుందన్నారు. నిర్మాణ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, స్థంభాలను తరలించాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న జడ్పీ ముఖద్వారాలను ఆయన పరిశీలించారు. ఇదే శైలిలో కలెక్టరేట్ ముఖద్వారాలను కళాత్మకంగా ఆధునీకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్‌ను నగరానికి వనె్నతెచ్చే విధంగా నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాజమండ్రి మున్సిపల్ కమీషనర్ సుమీత్‌కుమార్ గాంధీ, జడ్పీ సీఈవో విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.