తూర్పుగోదావరి

నేడు అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 10: అమలాపురం పురపాలక సంఘం ఛైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించేందు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. జెంటిల్‌మెన్ ఒప్పందం అమలులో భాగంగా ఇంతవరకూ ఛైర్మన్‌గా కొనసాగిన చిక్కాల గణేష్ పదవికి రాజీనామా చేయడంతో నాగసతీష్ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఎన్నికల సంఘం అదేశాల మేరకు ఛైర్మన్ ఎన్నికను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ సత్తిబాబును నియమించారు. ఆయన పర్యవేక్షణలో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు కౌన్సిల్ సమావేశమై ఛైర్మన్ అభ్యర్ధిత్వాని ప్రతిపాదిస్తారు. అయితే 30 మంది సభ్యులు గల కౌన్సిల్‌లో 22 మంది సభ్యులు టీడీపీవారే కావడంతో నాగసతీష్ ఎన్నిక లాంఛనం కానుంది. అన్ని సక్రమంగా జరిగితే అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి చేపట్టిన వారిలో నాగసతీష్ అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడంతోపాటు అత్యధిక విద్యార్హతలు కలిగిన ఛైర్మన్‌గా కూడా మున్సిపల్ రికార్డుల్లో నమోదు కానున్నారు. ఎంటెక్ విద్యార్హత కలిగిన నాగసతీష్ 12-07-1978లో జన్మించారు. అయితే 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం అత్యధిక స్థానాలు కైవశం చేసుకోవడంతో అప్పట్లో నాల్గవ వార్డు నుండి విజయం సాధించిన యాళ్ల మల్లేశ్వరరావు (నాగసతీష్ తండ్రి) మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ 22-11-2015న అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. దాంతో అప్పట్లో నాగసతీష్‌కు ఛైర్మన్ పదవి కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం అనుకున్నప్పటికీ ఆయన కౌన్సిల్ సభ్యుడు కాకపోవడంతో అధి సాధ్యకాలేదు. దీంతో సీనియర్ నాయకుడైన చిక్కాల గణేష్ ఛైర్మన్‌గా ఎన్నికైన సంగతి విధితమే. అనంతరం 4వ వార్డుకు నిర్వహించిన ఎన్నికలో నాగసతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా వైస్ ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంత వరకూ ఆపదివిలో కొనసాగి రాజీనామా చేసిన పెచ్చెట్టి విజయలక్ష్మికి ఇవ్వాలా, లేక మరో అభ్యర్ధికి అవకాశం కల్పించాలా అన్న దానిపై టీడీపీ అధిష్టానం సోమవారం రాత్రి వరకూ ఒక నిర్ణయానికి రాలేదు. అయితే 23వ వార్డుకు చెందిన దంగేటి విజయగౌరి ఆదవికోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం.

చంద్రన్న కానుకలు సిద్ధం
కాకినాడ సిటీ, డిసెంబర్ 10: క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు ప్రజలకు పంపిణీ చేసేందుకు చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలను సిద్దం చేసినట్లు జేసీ ఎ మల్లికార్జున తెలిపారు. జిల్లాలో ఉన్న తెల్లరేషన్ కార్డులు ఉన్న వారందరకీ చంద్రన్న కానుకలను అందజేస్తారు. ఈ కానుకల్లో రూ.207.94 విలువైన అరకిలో కందిపప్పు, అరకిలో సెనగపప్పు, కిలో ఆట, అరకిలో బెల్లం, అరలీటర్ పామాయిల్, వంద గ్రాముల నెయ్యిను బ్యాంగ్‌ల్లో పెట్టి రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.