తూర్పుగోదావరి

ప్రజావాణిలో అర్జీలకు సత్వర పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జనవరి 21: మీకోసం ప్రజావాణిలో అందే అర్జీలు, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియజేశారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం ప్రజావాణికి 355మంది వివిధ ప్రాంతాల నుండి హాజరై తమ అర్జీలు, ఫిర్యాదులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జేసీ మల్లికార్జున, జేసి-2 సత్తిబాబులకు అందజేశారు. అర్జీదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ఎక్కువ మంది అర్జీదారులు పింఛన్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు కావాలని, ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని, కుటుంబ తగాదాలను పరిష్కరించాలని, ఉద్యోగాలు, ఉపాధికల్పించాలని అర్జీలను అందజేస్తున్నట్లు చెప్పారు. తమకు అందుతున్న అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించిన అనంతరం వాటిని పరిష్కరిస్తామన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామానికి చెందిన రాయల సత్యజనార్ధన శ్రీ్ధర్ అనే క్రీడాకారుడు తాను జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించానని, అంతే కాకుండా జాతీయ, అంతర్జాతీయ రైఫిల్ పోటీల్లో పాల్గొన్నట్లు కలెక్టర్‌కు తెలియజేశారు. అంతర్జాతీయ రైఫిల్ పోటీల్లో పాల్గొనేందుకు 3.50లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించాల్సింగా కోరడంతో కలెక్టర్ మిశ్రా వెంటనే స్పందించి శాప్‌కు లేఖరాయాలని డిఆర్‌ఒను ఆదేశించారు. పలువురు అర్జీదారుల విన్నపానులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ మిశ్రా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి అర్జీలను పెండింగ్‌లో ఉంచుకుండా వాటిని సకాలంలో పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.