తూర్పుగోదావరి

అసెట్‌లో పసలపూడి విద్యార్థినికి మూడో ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, మే 8: ఆసెట్లో రాష్టస్థ్రాయిలో మూడవ ర్యాంకు సాధించి తన కుటుంబానికి, గ్రామానికి వనె్నతెచ్చిన విద్యా కుసుమం సుష్మిత. ఈమెది మండలంలోని పసలపూడి గ్రామం. ఆదివారం విడుదలైన ఆసెట్ ఫలితాల్లో తాడి సుష్మిత రాష్టస్థ్రాయిలో 3వ ర్యాంకు సాధించి, అందరి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా సుష్మిత మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహమే తనకు ఈ ర్యాంకు రావడానికి కారణమని ఎంతో వినయంగా చెప్పింది. గ్రూప్-1లో ర్యాంకు సాధించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని తెలిపింది. సుష్మిత రామచంద్రపురంలోని సెయింటాన్స్‌లో టెన్త్ చదివి 527 మార్కులు సాధించగా, మండపేట ఆదిత్యలో ఇంటర్ చదివి 97 శాతం మార్కులు సాధించింది. డిగ్రీ ఆదిత్య ఉమెన్ కళాశాలలో చదివి అక్కడి నుండే ఆసెట్‌కు కోచింగ్ తీసుకుంది. సుష్మిత తండ్రి గోపాలరెడ్డి దస్తావేజు లేఖరిగా పనిచేస్తుండగా, తల్లి మధులత గృహిణి. కాగా సుష్మిత మూడవ ర్యాంకు సాధించడంతో ఆమె ఇంట ఆనందానికి అవధుల్లేవు. సుష్మితను పలువురు అభినందించారు.