తూర్పుగోదావరి

పుష్కర కాలువలో పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, మే 12: ప్రత్తిపాడు మండలంలోని రాచపల్లి గ్రామంలో పుష్కర కాలువలో బట్టలు ఉతుకుతూ ఇద్దరు వ్యక్తులు కాలువలో పడి మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం రాచపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ సత్తిబాబు (45), పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన రావాడ చిన్నయ్య (20) అనే ఇరువురు పుష్కర కాలువ గట్టుపై బట్టలు ఉతుకుతూ కాలువలో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. అప్పటికే నీటి ప్రవాహానికి వీరిద్దరూ కొట్టుకుపోయారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం వరకు గాలించి పుష్కర కాలువలో ఉన్న ఇద్దరి మృతదేహాలకు బయటకు తీశారు. రోజూ బట్టలు ఉతకడానికి వీరు పుష్కర కాలువ గట్టుకు వెళుతుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బట్టలు ఉతుకుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడు సత్తిబాబు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. శివ ఎనిమిదవ తరగతి, సుబ్రహ్మణ్యం అయిదో తరగతి, ఆరేళ్ల దేవి రెండో తరగతి చదువుతోంది. సత్తిబాబు కుటుంబానికి ఆదాయం వచ్చే మార్గమేమీలేదు. ఈ కుటుంబమంతా సత్తిబాబు తెచ్చే ఆదాయంపైనే బతుకుతున్నారు. ప్రత్తిపాడు ఎస్సై నాగదుర్గారావు మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.