తూర్పుగోదావరి

హామీల మాటేమిటో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 17: ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేసిన దరిమిలా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. హోదాను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గతంలో జిల్లాకు వచ్చినపుడు ఎన్నో హామీలిచ్చారు. అవన్నీ ఇప్పుడు నెరవేరుతాయా లేదా అనేది సందేహమే. ప్రధానంగా కాకినాడలో హార్డ్‌వేర్ పార్కు ప్రకటించారు. పెట్రో కారిడార్‌ను శరవేగంగా పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ కారిడార్‌లో పరిశ్రమలకు హోదా చాలా కీలకం. హోదా దక్కని క్రమంలో పరిశ్రమలు ఏమేరకు వస్తాయో అనేది వేచిచూడాలి. గాడిమొగ రిలయన్స్ గ్యాస్‌లో రాష్ట్ర వాటా తీసుకొస్తామని సిఎం చెప్పిన మాట ఇంకా కార్యరూపం దాల్చలేదు. గత నెల 13 నుండి జిల్లాకు వచ్చిన సిఎం చింతూరులో ఐటిడిఎ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు పిఒ నియామకం జరగలేదు. ముంపు మండలాల్లో అన్ని సమస్యలూ పరిష్కరిస్తామన్నారు. ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. కార్యాలయాలకు శంకుస్థాపనలు మాత్రం జరిగాయి. ముంపు మండలాలైన ఎటపాక, కూనవరం, విఆర్ పురం, చింతూరు మండలాలతోపాటు ఏజెన్సీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అది పరిష్కారం కాలేదు. ముంపు మండలాల్లో ప్రధానంగా విద్య, వైద్య సదుపాయాలు మృగ్యంగా ఉన్నాయి. వాటిని తక్షణం పరిష్కరిస్తామని సిఎం హామీయచ్చారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ముంపు మండలాల ప్రజలు ఎక్కడ చదువుకోవాలో నేటికీ అగమ్యగోచరంగానే ఉంది. ఇక పోలవరానికి పట్టిసీమ ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఇంకా అధికారులు చేపట్టలేదు. కొత్త ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం 18 ఏళ్లు నిండిన వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. అది నేటికీ అమలైన పరిస్థితి కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి పుష్కరాల నిమిత్తం ఇచ్చిన రూ.240 కోట్లలో రూ.120 కోట్లే వచ్చాయి. మిగిలిన రూ.120 కోట్ల విడుదల మాటేమిటో అర్థం కాని పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాలే కాదు హామీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజమహేంద్రవరంలో కనె్వన్షన్ సెంటర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదింకా కార్యరూపం దాల్చలేదు. కాటన్ స్మృతితో ఇచ్చిన రూ.10 కోట్లతో ఇంకా మ్యూజియం పనులు చేపట్టలేదు. ఏదేమైనప్పటికీ సిఎం ఇచ్చిన హామీలు సత్వరం కార్యరూపం దాల్చాలని కోరుతున్నారు. అక్రమ ప్రాజెక్టుల నేపధ్యంలో డెల్టాకు కూడా నష్టం ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో సిఎంపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వైనం. మునుపటి హామీల మాటేమిటో కొత్తగా వచ్చే వరాలేమిటోనని ఎదురుచూస్తున్నారు.