తూర్పుగోదావరి

విలీన మండలాల్లో అస్తవ్యస్త పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, మే 22: ఆంధ్రలో విలీనమైన మండలాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. మండలంలో ఆదివారం ఆమె రోడ్డు షో నిర్వహించారు. అనంతరం హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే రాజేశ్వరి, వైసిపి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఆంధ్రలో విలీనమై రెండేళ్లు కావస్తున్నా ఈ మండలాల్లోని ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీ కాలేదన్నారు. దీంతో సమస్యల వలయంలో ఈ మండలాల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. విలీన మండలాల్లో ఎనిమిది రోజులు జరిగిన ఎమ్మెల్యే రోడ్డు షోలో పోలవరం పరిహారం పెంపు, తాగునీరు, పెన్షను తదితర సమస్యలపై వినతులు వచ్చినట్టు పేర్కొన్నారు. కాగా జూన్ నెలలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి విలీన మండలాల్లో పర్యటించనున్నట్టు, ఈ పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి మూసా, వై రామలింగారెడ్డి, సుధాకర్ (చిన్ని), మన్మధ హరి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.