తూర్పుగోదావరి

కాకినాడ రోడ్డులో లోడు లారీ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 2: ఇటీవల కాకినాడ రోడ్డులో పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా తవ్విన భారీ పైపులైన్ల గోతుల పూడికలో సంబంధిత వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాత్రివేళల్లో అవి భారీ వాహనదారులకు పెనుశాపంగా మారాయి. తరచూ ఈ గోతుల్లో పడి భారీ వాహనాలు బోల్తాపడుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కాకినాడ నుండి భద్రాచలం అట్టల చెత్త లోడుతో వెళుతున్న లారీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో డ్రైవర్‌కు సరిగా కనిపించకపోవడంతో ఈ పైపులైన్ తవ్విన ప్రాంతంమీదుగా నడపడంతో లోడు లారీ ఒక్కసారిగా బోల్తాపడింది. డ్రైవర్, క్లీనర్‌లు స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలిసింది. పైపులైన్ గోతులను సాదాసీదాగా పూడ్చి వెళ్లిపోవడంతో తరచూ ఈ పైపులైన్ సమీపంలోకి వెళ్లిన లారీలు, ఇతర వాహనాలు గోతుల్లో దిగబడి బోల్తా పడుతున్నాయి. స్థానిక సామర్లకోట లాకు సమీపంలో మూతపడ్డ పెట్రోలు బంకు సమీపంలో లారీ బోల్తా సంఘటన చోటుచేసుకుంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది.