తూర్పుగోదావరి

పుష్కర తొక్కిసలాటపై 10న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 3: గోదావరి పుష్కరాల తొలిరోజు పుష్కరాలరేవు వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిషన్ ఈనెల 10వ తేదీన స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో విచారణ చేపడతుందని బార్‌కౌన్సిల్ సభ్యుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలియజేశారు. ఇప్పటికే ఆయన కమిషన్ ఎదుట హాజరై, తన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇటీవల కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ కూడా ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈనెల 10న జరిగే విచారణలో ముప్పాళ్ల మరోసారి తన అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నారు. కలెక్టర్ అఫిడవిట్ తొక్కిసలాట బాధ్యులను రక్షించేదిగా ఉందని, అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైన ఆధారాలు, సహేతుక కారణాలను వివరించలేదని ముప్పాళ్ల విమర్శించారు. ఈఅంశాలను తాను కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.