తూర్పుగోదావరి

కేంద్ర ప్రభుత్వ పథకాలపై...నేడు కేంద్ర మంత్రుల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 3: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల ప్రగతిపై జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం కేంద్ర కమ్యునికేషన్స్, ఐటి మంత్రి రవిశంకరప్రసాద్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్ సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల అధికార్లు ఈ సమీక్షకు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో 4,5 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం 2నుండి సాయంత్రం 4 గంటల వరకు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తారు. బిఎస్‌ఎన్‌ఎల్, తపాలా, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రైల్వే, పోర్టులు, పౌర విమానయాన తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయా శాఖల ప్రగతి, సమస్యలపై సమీక్షించనున్నారు. తపాలా శాఖకు సంబంధించి సుకన్య సమృద్ధి ఖాతా, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా బీమా యోజన తదితర పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కూడా మంత్రులు సమావేశమవుతారు. 5వ తేదీన స్థానిక పద్మనాభ ఫంక్షన్ హాలులో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వికాస్ పర్వ్ సమావేశానికి కేంద్ర కేంద్ర మంత్రులు హాజరవుతారు. ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే సహా పలువురు జాతీయ, రాష్టస్థ్రాయి నేతలు హాజరవుతారు.