తూర్పుగోదావరి

ముద్రగడకు మద్దతుగా కిర్లంపూడి బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూన్ 10: గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రడను అరెస్టుచేసినందుకు నిరసనగా కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేశారు. ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలకు గురిచేసి పోలీసులు తీసుకుపోవడం అన్యాయమని పలువురు కాపు యువత విమర్శించారు. ప్రజా సమస్యల కోసం గతంలో ముద్రగడ ఆరుసార్లు నిరాహార దీక్షలు చేసిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రులెవరూ చంద్రబాబులా వ్యవహరించలేదన్నారు. ఈ చర్యతో సిఎం చంద్రబాబు పతనం ప్రారంభమైందన్నారు. భవిష్యత్తులో కాపుల తడాఖా ఏమిటో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. దీక్ష భగ్నంచేసి 24 గంటలు పూర్తయినా కిర్లంపూడిలో 2వేల మంది పోలీసులు పహారా కాస్తూ పలు కూడళ్లల్లో తిష్ఠవేసి కూర్చున్నారు. ఇళ్ల నుండి ప్రజలెవరూ బయటకు రావద్దని కిర్లంపూడిలో మైకుల ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. ముద్రగడ నివాసం పోలీసుల వలయంలో ఉంది. కిర్లంపూడిలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మండల కేంద్రం ప్రత్తిపాడులో ముద్రగడ దీక్ష భగ్నానికి నిరసనగా శుక్రవారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. ఇక్కడ కూడా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైసిపి సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీరాజు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కాపులకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలనే అమలుచేయాలని ప్రశాంతంగా ముద్రగడ ఇంటి వద్ద చేస్తున్న నిరాహార దీక్షను సిఎం చంద్రబాబు ప్రభుత్వం భగ్నం చేయడం అన్యాయమని ఆయన అన్నారు. కాగా ప్రత్తిపాడులో కూడా భారీ సంఖ్యలో పోలీసులు పలు కూడళ్లల్లో పహారా కాస్తున్నారు.