తూర్పుగోదావరి

సామర్లకోటలో నిరసన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 14: కాపులను బిసిల్లో చేర్చాలని, తుని సంఘటనలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సంఘీభావంగా మంగళవారం సామర్లకోట పట్టణంలో కాపు సంఘాల నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సుమారు 60 మంది నాయకులు, కార్యకర్తలను పెద్దాపురం సిఐ కె శ్రీ్ధర్‌కుమార్ ఆధ్వర్యంలో అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. తొలుత స్థానిక పిఠాపురం రోడ్డు నుండి కాపు సంఘాల నాయకులు సుమారు 200 మంది నల్లబ్యాడ్జీలు ధరించి ముద్రగడకు సంఘీభావం తెలియజేస్తూ ప్రదర్శనగా పెన్షన్‌లైన్‌లోని మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలుచేసి, తక్షణమే ముద్రగడ దీక్షను విరమింపచేయాలని, కాపులను బిసిల్లో కలపాలని దవులూరి సుబ్బారావు ఆధ్వర్యంలో తహసీల్దార్ డి సునీల్‌బాబుకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న అందరూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి అరెస్టుకావాలని పెద్దాపురం సిఐ కె శ్రీ్ధర్‌కుమార్ సూచించారు. ఆ మేరకు తహసీల్దార్ కార్యాలయం నుండి కాపు సంఘం నాయకులు కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కార్యక్రమంలో దవులూరి సుబ్బారావు, సంగినీడు భవన్నారాయణ, ముత్యం రాజుబాబు, మసకపల్లి సత్యనారాయణ, నిమ్మకాయల బుజ్జి, ఉప్పు కోదండం, పాగా సురేష్, ఆకుల పెదబాబు, డోలంకి వీరభద్రరావు, గంగిరెడ్డి కృష్ణమూర్తి, వర్రే రవి, సానా నారాయణరావు, కర్నీడి జలంధర్ పాల్గొన్నారు. ఎస్సై మురళీకృష్ణ బందోబస్తు నిర్వహించారు.