తూర్పుగోదావరి

జిల్లాలో రూ.134 కోట్లతో రోడ్ల నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 19: ఆకర్షనీయ నగరంగా ఎంపికైన కాకినాడ నగరానికి ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి తిమ్మాపురం, మాధవపట్నం, గురజనాపల్లి వరకు ప్రతిపాదించిన రహదారికి స్థల పరిశీలన చేశారు. కాకినాడ నగరంలో ట్రాఫిక్‌కు అధికంగా ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏ విధంగా బైపాస్ వెళ్లాలి, దాని వల్ల కలిగే మెరుగైన ఫలితాలు ఏమిటనే దానిపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రతిపాదిత బైపాస్ రహదారి రూట్‌మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జెసి- 2 జె రాధాకృష్ణమూర్తి, ఆర్‌అండ్‌బి ఇఇ కె సుబ్బరాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.