తూర్పుగోదావరి

ఖాళీ ప్రదేశాల్లో ఇసుక మేటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, జూలై 17: పట్టణంలో ఖాళీ ప్రదేశాల్లో ఇసుక గుట్టలు మేటలు మేటలుగా దర్శనమిస్తున్నాయి. ఇసుక నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులు ఏమయ్యాయో సంబంధిత అధికారులకే ఎరుక. రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకు సంబంధించిన అంశంలో ఘోరంగా విఫలమయిందన్న విమర్శలు వస్తున్న సమయంలో ప్రభుత్వం కూడా దఫదఫాలుగా చర్చలు చేస్తూ అప్పటికప్పుడు ఆవేశకావేశ నిర్ణయాలు తీసుకుంటూ అసలు సమస్యను మరుగునపడేలా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇసుకకు సంబంధించిన అంశంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, నూతన అనే్వషణ అనే పేరుతో నిర్వహిస్తున్న చర్యలు, జారీ అవుతున్న ఆదేశాలు ఆచరణకు నోచుకోక నవ్వులపాలవుతున్నాయి. డ్వాక్రా మహిళల పేరిట ఇసుక ర్యాంపులను నడిపించిన ప్రభుత్వం కొద్దికాలం తరువాత తప్పు చేశామేమోనన్న భావనతో వారి నుండి ర్యాంపుల నిర్వహణ బాధ్యతను తప్పించింది. ఆ తరువాత ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆచరణలో ఆ విధానం కప్పల తక్కెడ మాదిరిగా తయారై, ఇసుక తుపానులో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుపోతుందేమోనన్న భావన కలిగే పరిస్థితులను కల్పించింది. చివరిగా ఎక్కడైనా ఇసుక నిల్వలు చేస్తే సదరు అక్రమార్కులకు కఠినమైన శిక్షలను విధించే విధంగా కేసులు పెడతామని కూడా హెచ్చరికలు చేసింది. అయితే ఆ హెచ్చరికలు పలుచోట్ల ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయనడానికి ఈ ఇసుక మేటలే నిదర్శనాలు.