తూర్పుగోదావరి

శిలాఫలకానికి దండ వేసి పూజలు చేసి వినూత్న నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూలై 17: స్థానిక గాంధీనగరంలో గత ఆరు సంవత్సరాల క్రితం రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని ఏర్పాటు చేసిన శిలా ఫలకానికి పూలమాలలు వేసి పూజలు చేసి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలంటూ సామర్లకోట డివైఎఫ్‌ఐ నాయకులు ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి డి సింహాచలం మాట్లాడుతూ గాంధీనగరంలో రూ.5 లక్షలు సాధారణ నిధులతో డోరు నెంబర్ 18-11-56(2) నుండి 18-11-89 వరకూ సిసి రోడ్లు, డ్రెయిన్లు నిర్మించేందుకు అప్పటి ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ శంకుస్థాపన చేశారన్నారు. ఇది జరిగి ఆరేళ్లు దాటినా నేటికీ పనులు చేపట్టలేదన్నారు. వార్డు ఏర్పడి 45 ఏళ్ళు గడుస్తున్నా గాంధీనగర్ వాసులకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదన్నారు. అలాగే డ్రెయిన్ నిర్మాణం పనులు ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత మహిళలు, నాయకులు బర్ల గోపాల్, మహేష్, తులసీదాస్, వి అప్పారావు, సతీష్, గోపి, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.