తూర్పుగోదావరి

అంతర్‌రాష్ట్ర ధొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజోలు, జూలై 17: ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో వివిధ చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను ఆదివారం స్థానిక పోలీసులు అరెస్టుచేసి మీడియా ముందు హాజరుపర్చారు. సిఐ జివి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం..మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మేడిచర్ల నాగభూషణంను శివకోడులో అరెస్టుచేశారు. ఇతని వద్దనుండి సుమారు లక్ష రూపాయలు విలువైన 5 సావర్ల బంగారం, రూ.10వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు సిఐ తెలిపారు. నాగభూషణం తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్‌లో పలు కేసుల్లో కారాగార శిక్షననుభవించి ఈ సంవత్సరం మార్చి 16న బయటకు వచ్చినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు, మలికిపురం, నగరం, అమలాపురం, రావులపాలెం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నరసాపురంలో పలు నేరాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఇతని వద్దనుంచి చోరీ చేసిన సొత్తును రికవరీ చేసి, రాజోలు జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ వద్ద సోమవారం హాజరుపర్చనున్నట్టు తెలిపారు. ఇతనిని అరెస్టుచేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై ఎస్ లక్ష్మణరావు, ట్రైనీ ఎస్సై జి అజయ్‌బాబు, సర్కిల్ హెచ్‌సి బొక్కా శ్రీనివాసు, పిసిలు డి శివకుమార్, డి రమేష్‌బాబు, ఎ జయరామ్‌లను సిఐ అభినందించారు.