తూర్పుగోదావరి

వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 17: రాష్ట్రంలోని ఎత్తిపోతల పధకాలన్నింటి నుంచి పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం జరుగుతోందని రాష్ట్ర డిప్యూటీ సి ఎం చిన రాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామం వద్ద ఆదివారం వెంకటనగరం ఎత్తిపోతల పధకం ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు. సముద్రంలోకి వ ధాగా పోయే వరద జలాల ద్వారా పలు ఎత్తిపోతల పధకాల ద్వారా పొలాలకు అందించడం జరుగుతోందని, రైతులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఉత్పత్తులు సాధించాలన్నారు. గోదావరి నుంచి వ ధాగా పోయే జలాలను పట్టిసీమ ద్వారా సాగునీరు అందిస్తున్నామన్నారు. వెంకటనగరం పంపింగ్ స్కీమ్‌ను ప్రారంభించి సాగునీరు అందించడం రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ వెంకటనగరం పాత పంపింగ్ స్కీమ్ ద్వారా ఖరీఫ్‌లో వరికి 4,250 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. వెంకటనగరం కొత్త పంపింగ్ స్కీమ్ ద్వారా 34వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ శాసన సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.