తూర్పుగోదావరి

చివరి ఎకరా వరకు నీరందించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, జూలై 18: ఏలేరు పరీవాహక పరిధిలో అన్ని మండలాల్లో చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. సోమవారం మండల పరిధిలోని చదలాడలో ఏలేరు కాలువ జమ్మిదొడ్డి స్లూయిజ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏలేరు ఆధునికీకరణలో భాగంగా గతంలో కాలువలో నిర్మించిన ఆరు స్లూయిజ్‌ల స్థానే, ప్రస్తుతం రెండు స్లూయిజ్‌లు మాత్రమే నిర్మిస్తున్నారని, దీని వల్ల సాగు నీరు పారుదలలో సమస్యలు తలెత్తుతాయని వడ్లమూరు, గోరింట, పులిమేరు, చదలాడ, తిరుపతి, ఉలిమేశ్వరం, పెద్దాపురానికి చెందిన రైతులు, నీటి సంఘ నేతలు మంత్రి వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులుతో చర్చించారు. ఏలేరు ఆధునికీకరణ పనులు సిఇ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వారి ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. ప్లాను మార్పు జరగాలంటే సంబంధిత ఆర్గనైజేషన్ అనుమతులు కావాలన్నారు. అనంతరం స్థానిక తిరుపతికాలనీ వాసులతో మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు జగదీశ్వరరావు, పద్మజ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
32 మేకలను పొట్టనపెట్టుకున్న కుక్కలు
డి గన్నవరం, జూలై 18: మండలంలోని వాడ్రేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి మేకల మందపై కుక్కల దాడిచేయడంతో 32 మేకలు మృతిచెందగా, మరో 18 మేకలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వాడ్రేవుపల్లి గ్రామానికి చెందిన గండుమోను సత్యనారాయణ, గండుమోను వీరపండు, గండుమోను లక్ష్మి, గండుమోను నాగేశ్వరరావులకు చెందిన మేకల మందలపై ఆదివారం అర్ధరాత్రి కుక్కలు గుంపుగా దాడిచేయడంతో 32 మేకలు, గొర్రెలు మృతిచెందగా, 18 మేకలు తీవ్రంగా గాయపడ్డాయి. అమలాపురం వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అడబాల విశే్వశరరావు, పి గన్నవరం పశువైధ్యాదికారి రవికుమార్ గాయపడిన మేకలకు వైద్య చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి చేరుకుని నష్టపోయిన మేకల పెంపకందార్లను ఓదార్చారు. గాయపడిన మేకలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వెటర్నరీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామంలో కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయని, గత వారం మూడు మేకలను చంపేశాయన్నారు. మేకల పెంపకం ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నామని మేకల పెంపకందారులు బోరున విలపిస్తూ ఎమ్మెల్యేకు తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీవోకు విషయాన్ని వివరించి ఈ నష్టాన్ని నమోదుచేసి ప్రభుత్వ పరంగా వచ్చే వాటిని వారికి అందివ్వాలని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి విషయాన్ని తెలియజేసి తగిన సాయం అందించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే పులపర్తి వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట టిడిపి రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాధుబాబు, గ్రామ సర్పంచ్ కుసుమ సంసాని పెద్దిరాజు ఉన్నారు. కుక్కల దాడిలో జరిగిన నష్టాన్ని ఆర్‌ఐ ఉమాశంకర్, విఆర్వో వెంకటేశ్వరరావు నమోదుచేశారు.
ఎందుకు వెళ్లారు... ఎందుకు వస్తున్నారు!