తూర్పుగోదావరి

సర్వే వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 22: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సర్పవరంలో సర్వేను పరిశీలించారు. కొన్ని సందర్భాలలో సర్వర్ డౌన్‌లోడ్ కావడంతో డేటా నమోదు కావడం లేదని సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. రూరల్ తహసీల్దారు జె సింహాద్రి సర్వే వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. శుక్రవారం మండలంలో 138 గృహాలకు చెందిన 410 వ్యక్తుల వివరాలను సేకరించగా ఇప్పటివరకు మండలంలో 4వేల మంది వివరాలను సేకరించినట్లు కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఎన్యూమరేటర్ రోజూ 14 కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా 10 కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఇంటర్నెట్ సదుపాయం లేని ఏజెన్సీ గ్రామాల్లో ఆఫ్ లైన్ సర్వే నిర్వహించడానికి వెసులుబాటు కల్పించారని, దీనికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. తొలిదశలో ఎదురైన సాంకేతిక సమస్యల మూలంగా ఈ సర్వేను మరో కొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందన్నారు. ఈ సర్వే నిర్వహణలో భాగంగా శుక్రవారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 8118 కుటుంబాలకు చెందిన 22031 సభ్యులు, పట్టణ ప్రాంతాల్లో 1839 కుటుంబాలకు చెందిన 6136 సభ్యుల వివరాలను సేకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 9957 కుటుంబాలకు చెందిన 28,167 సభ్యులకు సంబంధించిన సర్వేను పూర్తి చేశామని కలెక్టర్ వెల్లడించారు. అనంతరం కలెక్టర్ సర్పవరంలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని తహసీల్దారు సింహాద్రిని ఆదేశించారు.