తూర్పుగోదావరి

మేము సైతం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 24: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎపిఎస్‌పిఎఫ్) రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమాండెంట్ డిఎస్‌ఎ బాషా జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఎపిఎస్పీఎఫ్ కార్యాలయం నుంచి ఒఎన్జీసీ బేస్ కాంప్లెక్సు, కలవగొయ్యి మీదుగా శ్రీకృష్ణపట్టణం, పుణ్యక్షేత్రం వరకూ సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కమాండెంట్ డిఎస్‌ఎ బాషా మాట్లాడుతూ ప్రజల్లో పర్యావరణ సంరక్షణ, దేహదారుఢ్యం, సహజ వనరుల వినియోగాన్ని కాపాడుకునే ముఖ్య ఉద్దేశ్యంతో ఎపిఎస్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ (గుంటూరు) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ ర్యాలీలో సుమారు 70 మంది పాల్గొన్నట్టు చెప్పారు. సైకిల్‌ను ఉపయోగించడం వల్ల శరీరానికి కలిగే లాభాలను బాషా తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ టి గంగారాం, సిబ్బంది పాల్గొన్నారు.