తూర్పుగోదావరి

ఆన్‌లైన్‌లో ‘సంక్షేమ’ హాజరు తనిఖీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 24: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు విధానాన్ని ఇకనుండి ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేసేవిధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పిల్లలతో పాటు వసతి గృహాల సంక్షేమాధికారులు, సిబ్బంది హాజరును సైతం ఆన్‌లైన్‌లోనే ఆ శాఖ పర్యవేక్షించనుంది. ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుండి 9 గంటల వరకు పిల్లలు, సంక్షేమాధికారులు, సిబ్బంది హాజరును సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఎఎస్‌డబ్ల్యుఒలు విధిగా ఆన్‌లైన్‌లో తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ తనిఖీల ద్వారా హాస్టళ్లలో హాజరు శాతం పూర్తిగా మెరుగుపడే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేస్తుండటంతో ఆన్‌లైన్ తనిఖీకి మార్గం సుగమం అయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో 81 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 8600 సీట్లున్నాయి. 8278 మంది విద్యార్ధులు ఆయా వసతి గృహాల్లో ఉన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందే సౌకర్యాలతో పాటు ఉచిత విద్యను అందిస్తున్నారు. పిల్లల హాజరును ప్రతిరోజు తనిఖీ చేయడంతో పాటు వసతి గృహాల్లో ఇతర సమస్యలపై పర్యవేక్షణ వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వంట గదుల్లో పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించాలని, ప్రస్తుత సీజన్‌లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో అప్రమత్తం కావాలని స్పష్టంచేసింది. విద్యార్థులకు ఆహారం (డైట్), కాస్మొటిక్స్, ఇతర పరికరాల నిర్వహణ, ట్యూటర్ల వేతనాల చెల్లింపు సకాలంలో జరిగేలా పర్యవేక్షణ వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుండి వారానికి ఒక రోజు వసతి గృహాల్లో సాంఘిక సంక్షేమ శాఖాధికారులు బసచేసి, విద్యార్థుల సాధక బాధకాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. హాస్టళ్ల ఆవరణలో ఆయా సీజన్లలో పెరిగే ఆకుకూరలు, కూరగాయల మొక్కల పెంపకంపై దృష్టిసారించారు.
హాస్టల్ విద్యార్థులతో విద్య, పారిశుద్ధ్య తదితర కమిటీలను ఏర్పాటుచేసి, వారిలో నాయకత్వ పటిమ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమాధికారులు టెలీగ్రామ్ యాప్ గ్రూప్‌గా ఏర్పాటు కావాలని, సంక్షేమ హాస్టళ్ళ పట్ల పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తోన్న వసతి గృహాల నిర్వహణ తీరును తనిఖీల ద్వారా తెలుకోవాలని, అక్రమ విద్యుత్, తాగునీటి కనెక్షన్లుంటే అందుకు బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.