తూర్పుగోదావరి

మహిళ మృతదేహంతో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరప, మార్చి 23: కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామంలో మంగళవారం ఒక మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోగా, కుటంబసభ్యులు, బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే పెద్దాపురప్పాడు శివారు వై సావరంనకు చెందిన డేగల మహాలక్ష్మి(48) అదే ప్రాంతానికి చెందిన డేగల కొటమ్మ, దుర్గమ్మ, వీరబాబు, వీరయ్యల మధ్య కొంతకాలం క్రితం సమీపంలో గల బావి వద్ద నీటి విషయమై ఘర్షణ పడ్డారు. దీనిపై గత నెల 25న మహాలక్ష్మి కుమారుడు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి ఎఎస్సై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈ నెల 8న నలుగురు నిందితులకు జరిమానా విధించింది. అప్పటి నుండి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా మంగళవారం ఉదయం మహాలక్ష్మి తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నలుగురు వ్యక్తులూ పదేపదే మహాలక్ష్మిని దూషించడంతో పాటు అందరి మధ్య అవమానించడంతోనే తీవ్ర మనస్తాపానికి గురైన మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని, పోలీసులు కేసు పెట్టినా తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, బంధువులు మహాలక్ష్మి మృతదేహంతో పెద్దాపురప్పాడు-కోటిపల్లి రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో కరప పోలీసులు రంగంలోకి దిగి నిందితులపై చర్యలు తీసుకంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు.