తూర్పుగోదావరి

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 26: అంగన్‌వాడీలు బాలలు భవిష్యత్తుకు నిర్దేశకులని, వారికి మంచి పౌష్టికాహారం అందించి దేశానికి వనె్న తెచ్చే విధంగా తయారుచేయాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సూచించారు. మంగళవారం ఎస్‌ఆర్‌ఎంటి ఫంక్షన్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖచే ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమానికి చాగంటి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ సమాజంలో మహిళలకు చాలా గౌరవముందన్నారు. గర్భిణీ తన శరీరానికి పౌష్టికాహారం అందించుకుంటూ ఆరోగ్యవంతమైన బిడ్డలను కనాలనుకుంటుందన్నారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి పౌష్టికాహారం అందించటంలో శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 5546 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని, వీటి ద్వారా రెండున్నర లక్షల మంది చిన్నారులకు, బాలింతలకు పౌష్టికారాహాన్ని అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జిల్లాలో వెయ్యి అంగన్‌వాడీ భవనాలను నిర్మించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సామాజిక సాధికారత కమిషన్ ద్వారా మహిళలు, బాలల ఆరోగ్య పరిరక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీలు ప్రజల్లో భాగమేనని, వారు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం చాగంటిని కలెక్టర్ దంపతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి టి ప్రవీణ, ఎపిడి ఎం నాగరత్నం, సోము ప్రసాద్, అంగన్‌వాడీలు హాజరయ్యారు.