తూర్పుగోదావరి

అంత్య పుష్కరాల ఏర్పాట్లు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 26: అంత్య పుష్కరాలకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువున్నా ఏర్పాట్లు ఇప్పటికీ అధ్వాన్నంగా ఉండటంపై ఎమ్మెల్సీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై వెంటనే మేధావులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అంత్య పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. దీనిలో భాగంగా కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, మార్కండేయస్వామిరేవు, పద్మావతి ఘాట్, విఐపి, విశే్వశ్వర ఘాట్లను పరిశీలించి, ఏర్పాట్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మూహూర్తం ముంచుకొస్తున్నా అధికారుల్లో కదలిక కనిపించడం లేదన్నారు. రేవుల్లో ఇప్పటికీ బురదను తొలగించలేదన్నారు. రేవులను శుభ్రం చేసేందుకు ఫైరింజన్లు వినియోగించాలన్నారు. గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున స్నానఘట్టాల శుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. వరదలను దృష్టిలో ఉంచుకుని నీటిని తోడేందుకు ఓఎన్జీసి, పేపరుమిల్లు నుంచి మోటార్లు తెప్పించి నల్లాచానల్ వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలన్నారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లలో జాప్యంపై కలెక్టర్‌ను కలిసి చర్చిస్తానని సోము చెప్పారు. నగర బిజెపి అధ్యక్షుడు బొమ్ముల దత్తు, నాయకులు పొట్లూరి రామ్మోహనరావు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, కొంతం కృష్ణ, సత్తి మూలారెడ్డి, పిల్లి మణెమ్మ, గీతా మహాలక్ష్మి, దాస్యం ప్రసాద్ తదితరులు సోము వెంట ఉన్నారు.
పాకిస్తాన్ మద్దతుదారులను తరిమికొట్టాలి
కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నా పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్న నాయకులను తరమికొట్టాలని ఎమ్మెల్సీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం లాలాచెరువు సెంటర్‌లోని కార్గిల్ యుద్ధవీరుడు సార్జెంట్ రవిప్రసాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ స్నేహానికి ఎంత విలువ ఇస్తామో, అవసరమైతే యుద్ధంలో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయ్ చాటిచెప్పారన్నారు. కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ తరిమికొట్టిందని గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు బొమ్ముల దత్తు, పొట్లూరి రామ్మోహనరావు, రేలంగి శ్రీదేవి, టి సత్యనారాయణ, వంకా వెంకట్రావు, కె నరసింహారావు, రేలంగి మోహన్, వెత్సా వరలక్ష్మి పాల్గొన్నారు.