తూర్పుగోదావరి

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడివుంది:కారెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 28: తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 7కోట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేసిందన్నారు. గురువారం రాత్రి ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో రాష్ట్రంలోని సుమారు లక్ష 3వేల ఎస్సీ లబ్దిదారుల కనెక్షన్లకు రూ. 4.13కోట్లకు పైగా, 34వేలకు పైగా ఎస్టీ లబ్దిదారుల ఇళ్లకు రూ. 2.37కోట్లకు పైగా ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేసిందని వివరించారు. కమిషన్ చైర్మన్‌గా పదవి చేపట్టిన రెండున్నర నెలల కాలంలో రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు, 4 యూనివర్శిటీలు, 3 కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి, 3వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నానని చెప్పారు. దళితుల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టానని వివరించారు. శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా జరిగే వనం మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఇంటికో మొక్క నాటాలన్నారు. ఇప్పటి వరకు 12లక్షల మొక్కలు నాటారని, మరో కోటి 60లక్షల మొక్కలను సిద్ధం చేశారన్నారు. ఈసందర్భంగా అర్బన్ ఎస్పీ బి రాజకుమారి శివాజీని మర్యాదపూర్వకంగా కలిశారు.