తూర్పుగోదావరి

‘స్థానిక’ నేతలపై గురుతర బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, జూలై 28:ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నేతలకు ఉపదేశించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన ఏర్పాటుచేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు అమలు చేస్తున్నదని, అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంవల్ల అవి ప్రజలకు చేరువ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సమన్వయ కమిటీల సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు మరింత బలోపేతంగా పని చేయాలన్నారు. పింఛన్ల పెంపు, మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రోత్సాహాలు, కాపు, ఎస్సీ ఎస్టీ, బిసి సామాజిక వర్గానికి ప్రత్యేక రుణాలు, ఉన్నత విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని ప్రజలకు చేరువ చేసేలా కార్యకర్తలు కృషిచేయాలన్నారు.
పార్టీ ప్రయోజనాలే ముఖ్యం: చినరాజప్ప
పార్టీలోని వ్యక్తుల కన్నా పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నియోజకవర్గాల్లో విభేదాలను వీడి, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. పార్టీ నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. పార్టీ శిక్షణా తరగతులను కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలోని 19 నియోజక వర్గాలకు సంబంధించిన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్యచౌదరి, వివిఎస్‌ఎన్ వర్మ, దాట్ల బుచ్చిరాజు, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, గొల్లపల్లి సూర్యారావు, వనమాడి కొండబాబు, తోట త్రిమూర్తులు తదితరులు ప్రసంగించారు.
నియోజకవర్గాల సమీక్షల్లో భాగంగా ఎమ్మెల్యేలు, సమన్వయ కమిటీ సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక తయారు చేసి రాష్ట్ర కమిటీకి అందజేయనున్నట్టు మంత్రి దేవినేని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు, పులపర్తి నారాయణమూర్తి, పిల్లి అనంతలక్ష్మి, అయితాబత్తుల ఆనందరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు బండారు సత్యానందనావు, శీతంశెట్టి వెంకటేశ్వరరావు, యనమల కృష్ణుడు, జ్యోతుల చంటిబాబు, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, లక్ష్మీకుమారి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, రాజమండ్రి నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూరమేష్, రాష్ట్ర కార్యదర్శి, టిడిపి జిల్లా పరిశీలకులు నిమ్మల రామానాయుడు, గంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఎమ్మెల్సీ వీరన్నచౌదరి, మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, ఎఎంసి ఛైర్మన్ ముత్యాల రాజబ్బాయి, జిల్లా జాయింట్ సెక్రటరీ ముత్యాల బాబ్జి, పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎంపిపిలు, జడ్పీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.