తూర్పుగోదావరి

వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యంచేస్తే ఆహార సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 28: వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆహార సంక్షోభం తప్పదని, వ్యవసాయ రంగ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణం సంకల్పించేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌కు రైతులు విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని కృషి భవన్‌లో గురువారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ బృందం, వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న నైరాశ్య పరిస్థితులపై సమీక్షించడానికి, వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధన కోసం తమ కమిషన్ ఏర్పాటయ్యిందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నేరుగా అన్నదాతల నుండి అభిప్రాయాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖీలో పలువురు రైతులు ప్రభుత్వ అనాలోచిత విధానాలపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కాలువలకు ఏటా ఆలస్యంగా నీటిని విడుదల చేస్తుండటంతో నారుమళ్ళు, నాట్లు వేయడంలో ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల కోతల సమయంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవలసి వస్తోందన్నారు. నకిలీ పురుగుమందుల అమ్మకాలను నివారించకపోవడంతో రైతాంగం తీవ్రంగా
నష్టపోతోందన్నారు. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, రైతు పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి అవసరమైన గోదాములు అందుబాటులో లేకపోవడంతో పంట నాశనం అవుతోందన్నారు. గ్రామస్థాయిలో గోదాములను నిర్మిస్తే రైతుల పంటకు భరోసా కల్పించినట్టవుతుందన్నారు. రుణమాఫీని విడతల వారీగా అమలుచేస్తుండటంతో ప్రయోజనం ఉండటం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే విడతలో రుణమాఫీ జరిగితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. కొత్త పంటల బీమా రైతులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, సరైన ప్రచారం లేక అధిక శాతం మంది చెల్లించలేకపోయారని చెప్పారు. అలాగే నాట్లు కూడా ఆలస్యం అయినందున ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఎన్ని రాయితీలు కల్పించినా పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతు వ్యవసాయంపై దృష్టి సారించగలడని, లేని పక్షంలో ఉన్న భూములను అమ్ముకుని, వ్యవసాయాన్ని వదులుకుంటారన్నారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ ఎస్ గులాబ్, ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి, ప్రొఫెసర్ కెఎస్ రెడ్డి, డాక్టర్ టి సత్యనారాయణ, డాక్టర్ మిశ్రా, టాస్క్ఫోర్స్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ జెడి కెఎస్ ప్రసాద్, ఉద్యానవన శాఖ ఎడి గోపీకృష్ణ, మార్కెటింగ్ శాఖ ఎడి కిశోర్, మత్స్యశాఖ డిడి కళ్యాణం, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.