తూర్పుగోదావరి

శ్రావణం రాకతో ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 2: శ్రావణ మాసం ఆరంభం కావడంతో అంత్య పుష్కర స్నానాలకు మరింత ప్రాశస్త్యంగా నిర్వహిస్తారు. దీంతో బుధవారం నుంచి అఖండ గోదావరి నది అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరంలో అత్యధిక రద్దీగా మారేందుకు అవకాశం వుండటంతో అధికారులు ఆమేరకు ఏర్పాట్లు పెంచుతున్నారు. మంగళవారం పుష్కర రద్దీ అంతా పుష్కర ఘాట్, సరస్వతి ఘాట్లలోనే అధికంగా కన్పించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సుమారు 72 వేల పైచిలుకు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారికంగా తెలియజేశారు. రానున్న రోజుల్లో శ్రావణ మాసం ప్రసిద్ధితో పాటు నది జీవశక్తి కూడా మరింతగా పెరిగేందుకు అవకాశం వున్న రీత్యా అంత్య పుష్కర స్నానం మరింత విశిష్టత సంతరించుకుంటుందంటున్నారు. స్నాన ఘట్టాల్లో విస్తృతంగా వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. జోన్లవారీగా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తున్నారు. శ్రావణ మాసం మరింత ప్రసిద్ధిగా పుణ్య స్నానాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం రద్దీ కాస్తంత తగ్గింది. పుష్కర ఘాట్, విఐపి సరస్వతి ఘాట్‌లో భక్తుల రద్దీ వేకువ జాము నుంచి కొనసాగింది. రానున్న తొమ్మిది రోజులు రోజురోజుకూ రద్దీ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు నదిలో వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువ భద్రాచలం వద్ద 21.4 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. పోలవరం కుడి కాల్వ గండి పడటంతో నీటి వృథా కాకుండా పట్టిసీమ వద్ద పంపులను కట్టేశారు. దీంతో వరద జలాలు ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. దీంతో అఖండ గోదావరి నది స్నాన ఘట్టాల్లో నీటి మట్టం బాగా తగ్గింది. దీంతో ఫెన్సింగ్ వరకు వెళ్ళినా తలారా స్నానం ఆచరించేందుకు కొన్ని ఘాట్లలో వీలు కలగలేదు. ఒరిస్సా, చత్తీష్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా శబరికి వర్షాలు వచ్చే అవకాశం వుందని, ఈమేరకు గోదావరి నదిలో ఉపనది శబరికి వరద నీటి ఉద్ధృతి మరో రెండు రోజుల్లో పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 3, 5, 7, 9 తేదీల్లో మరింత రద్దీ వుంటుందని దేవాదాయ శాఖ అంచనా వేసింది. గోదావరి నదిలో పిండ ప్రదాన క్రతువులు విడిచిపెట్టేందుకు విశేషత సంతరించుకుంది. ఇక్కడ నీటిలో అస్థికలు సంపూర్ణంగా విలీనమవుతాయి. అందుకే వాసికాలు, శ్రాద్ధ కర్మలు యథాశక్తిగా ఈ తీరంలో వారి వారి ఆచారాలను బట్టి నిర్వహించుకోవడం నదీ సంప్రదాయం. జంగం దేవరలతో వీరభద్రులుగా వున్నవారిని జ్ఞప్తికి తెచ్చుకుని నది ఒడ్డున ఆయా కుటుంబాల్లోనివారి పోలికలు కన్పిస్తే వారి కాళ్ళకు దణ్ణం పెట్టుకుని సంకల్పం ఇచ్చుకోవడం ఆచారం వుంది. ఈ ఆచారం మంగళవారం గోదావరి ఘాట్లలో విశేషంగా కన్పించింది. వాస్తవానికి ఈ 12 రోజులు కూడా నదీ జలాల్లో జీవశక్తి అత్యధికంగా వుంటుందనేది సైన్స్ రుజువు చేస్తున్న అంశం కావడంతో ప్రకృతిని ఆరాధించుకునే తత్వంతోనే అత్యధికంగా స్నానాలు పెరిగాయంటున్నారు. పురాణేతిహాసాల ప్రకారం గోదావరి నదికి వృద్ధ గంగగా విశేషం వుంది. కాశీ వెళ్ళాలనుకునేవారు, వెళ్లివచ్చిన వారూ ఖచ్చితంగా అంత్య పుష్కరాలకు వస్తుంటారు. కాశీ వెళ్లిన ప్రతీ సారి గోదావరి నదికి గంగపూజ చేయించుకోవాలనేది సంప్రదాయం కాబట్టి గంగపూజ, కాలభైరవ పూజ గోదావరి తీరంలో చేసుకోవడమే పరమ పవిత్రంగా భావిస్తారు. అస్థిక సంచయనం చేసినా అవశేషాలు కన్పించకుండా ఈ గోదావరి జలంలో విలీనమవుతాయి. అందుకే గోదావరి నదిలోనే శ్రాద్ధ కర్మలకు ప్రసిద్ధి. అందుకే అస్థికలు భద్రపర్చుకునే సదుపాయం ఒక్క కోటిలింగాల ఘాట్‌లోనే వుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే వున్న ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటూ ఈ తీరంలోనే శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం విశేషంగా మారింది. ఈమేరకు మంగళవారం గోదావరి తీరంలో శ్రాద్ధ కర్మలు అధికంగా జరిగాయి.