తూర్పుగోదావరి

పి నాయకంపల్లిలో డయేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, ఆగస్టు 4: గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామంలోని ఎస్సీ పేటలో గురువారం డయేరియా వ్యాధిన పడి 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ ఆసుపత్రులకు తరలించారు. జోడా కుమారి, తాడేపల్లి రాఘవ, గంధం సత్యనారాయణ, సాంబత్తుల చంద్ర, ఇజ్జిన ఆంజనేయులు, ఇజ్జిన స్వరూప, బ్రహ్మదేవి, జీవిత, మురారి అప్పారావు, బొళ్లం అపర్ణ, బొళ్లం మానస విరోచనాలు, వాంతులతో బాధపడుతుండటంతో స్థానిక పిహెచ్‌సి సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. వర్షాలకు తాగునీరు కలుషతమై పలువురు వ్యాధి బారిన పడినట్టు స్థానికులైన జోడా స్వామి, తాడేపల్లి కుమారి తదితరులు వెల్లడించారు. ఇలావుండగా గ్రామ సర్పంచ్ ఉండవిల్లి నారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం బాగానే ఉందని, పైపులైన్లు లీకేజీ లేకుండా తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించారు. ఇలావుండగా కాట్రావులపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి రత్నం మాట్లాడుతూ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రోగులను పరీక్షించి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సీజనల్‌గా వచ్చే డయేరియాగా గుర్తించామన్నారు. ప్రస్తుతం వ్యాధి అదుపులోనే ఉందని డాక్టర్ రత్నం స్పష్టం చేశారు.