తూర్పుగోదావరి

రెండంకెల ఆర్థిక ప్రగతి లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు వార్షిక ఆర్ధిక ప్రగతిలో రెండంకెల అభివృద్ధి సాధనకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 7 మిషన్లలో అవసరాలను గుర్తించి, అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను తయారుచేశారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, నైపుణ్యాభివృద్ధి, స్ర్తి-శిశు సంక్షేమాల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ శాఖల్లో వినూత్న పథకాల అమలుకు ప్రభుత్వ యంత్రాంగం సంబంధిత అధికారులతో చర్చించి, వినూత్న పథకాలు అమలుచేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు మంజూరు చేయగా వీటిలో 8 కోట్ల విలువైన 23 పనులను చేపట్టనున్నారు. జిల్లాలో 42 పశువుల దాణా కేంద్రాలు ఏర్పాటు ద్వారా అధిక పాల దిగుబడికి చర్యలు చేపట్టారు. ఇందుకు 1.05 కోట్లను వెచ్చించనున్నారు. దాణా తయారీ కేంద్రాన్ని పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో ఒక దాణా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తుండగా, మిగిలిన 41 కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 44.39లక్షల వ్యయంతో గోపాలమిత్ర కేంద్రాలు, పశువుల ఆసుపత్రుల్లేని గ్రామాల్లో పశువులకు వైద్యం, కృత్రిమ గర్భధారణకు ఇంజక్షన్లు, ఇతర పరీక్షల నిర్వహణకు, 450 పశువుల బోన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. 72 లక్షల వ్యయంతో పాడి పశువుల్లో జలగ వ్యాధి నివారణకు జలగ నివారణ మందును రెండు డోసులుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. మొదటి విడతగా 1.50 లక్షలతో పశువులకు ఈ మందు అందజేస్తారు. కృత్రిమ రసాయనాల ద్వారా పండ్లు మగ్గబెట్టే చర్యలకు జిల్లాలో కళ్ళెం వేయనున్నారు. జిల్లాలో 8 పండ్లు మగ్గించే కేంద్రాలను 1.28 కోట్లతో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ క్రింద ఒక్కొక్క కేంద్రం నిర్మాణానికి 16 లక్షలు వెచ్చిస్తున్నారు. కొబ్బరి సేకరణ, గ్రేడింగ్, మార్కెటింగ్ కేంద్రాలను కోటి రూపాయల వ్యయంతో అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో ఏర్పాటుచేస్తున్నారు. కొబ్బరి దింపు అనంతరం ఆరబెట్టి, నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఈ యూనిట్‌ను 75 లక్షల ఇన్నోవేషన్ నిధులు, 25 లక్షల రైతుల వాటాతో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల వలన కొబ్బరి కాయలను 8 నుండి 9 నెలల వరకు నిల్వవుంచే అవకాశం ఉంటుంది. మత్స్యశాఖ ద్వారా 21.92 లక్షలతో ఏలేరు రిజర్వాయర్‌లో పంజరంలో తిలపియా చేపల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో భాగంగా 17 గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కుట్టు కేంద్రానికి 19.20 లక్షల ఖర్చుతో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు 340 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలోను, పి గన్నవరంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో ఆధునిక వ్యవసాయ పనిముట్లు అద్దెకిచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క కేంద్రాన్ని 87.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయగా ఇందులో వినూత్న కార్యక్రమాల నిధుల నుండి 21.79 లక్షలు రాయితీగా ఇచ్చారు. అలాగే జిల్లాలో 4.06 లక్షల వ్యయంతో సామర్లకోటలో పశుగ్రాస కేంద్రాల ఏర్పాటు, ఏజన్సీ గంగవరంలో 2.42 లక్షలతో పప్పు దినుసుల మరలు, 45 లక్షలతో జిల్లాలో రైతులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు, 25 లక్షలతో పశువుల దాణాకు సంబంధించి పుస్తకాల ముద్రణ, మత్స్యశాఖ ద్వారా 54.84 లక్షల వ్యయంతో పనగాసియా చేపల పెంపకం, చేప పిల్లల పెంపకం కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ముమ్మిడివరంలో 50 లక్షలతో ఉద్యాన వన పంటలపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కోటి రూపాయలతో 5 వేల హెక్టార్ల మామిడితోటల్లో కీటక ఆకర్షకాలు, 45 లక్షలతో కాయగూరల పెంపకానికి ప్రాధాన్యతనిస్తారు. 109.55 లక్షలతో సేంద్రియ ఎరువుల పరిశోధన శాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.