తూర్పుగోదావరి

అదుపులో మావోల కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటనందూరు, ఆగస్టు18: తూర్పు ఏజన్సీ ప్రాంతంలో మావోల కదలికలు గత ఆరు నెలలుగా అదుపులో ఉన్నాయని రంపచోడవరం ఎఎస్పీ అడ్నాన్ నాయిం అస్నీ అన్నారు. గురువారం కోటనందూరులో అట్రాసిటీ కేసు విచారణ నిమిత్తం విచ్చేసిన ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోల అదుపునకు తాము చేపట్టిన కార్యక్రమాల వల్ల కదలికలు అదుపులో ఉన్నాయన్నారు. అదేవిధంగా 67మంది మిలిషియా సభ్యులు, వినోద్ అనే దళ సభ్యుడు లొంగిపోయారన్నారు. గత మే నెలలో మావోల డంప్‌ను సైతం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.గిరిజనులు మావోల వైపు ఆకర్షితులు అవ్వకుండా వారిలో అవగాహన కల్గించేందుకు జనమైత్రి, మీకోసం పోలీసు వంటి కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు ఐటిడిఎ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఆర్మీ, పోలీసు ఉద్యోగాల సాధన కోసం 300 మందికి ఐటిడిఎ ద్వారా హైదరాబాద్‌లో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఏజన్సీలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. గత జనవరి నుండి రూ.5కోట్లు విలువైన గంజాయి,వాహనాలను స్వాధీనం చేసుకొన్నామన్నారు.
అట్రాసిటీ కేసుపై విచారణ
మండలంలోని భీమవరపుకోట గ్రామానికి చెందిన అల్లంపల్లి నరసింహమూర్తిని కోటనందూరుకు చెందిన సుబ్బారావు, ప్రకాష్‌లు బీమా సొమ్ము విషయంలో దాడి చేసి కులంపేరులో దూషించారంటూ ఈనెల 5న ఇచ్చిన ఫిర్యాదుపై ఎఎస్పీ అస్నీ గురువారం విచారణ నిర్వహించారు. కోటనందూరు విచ్చేసిన ఆయన సంఘటన ప్రదేశంలో వివరాలు సేకరించారు. అనంతరం ఫిర్యాదు దారుడు నరసింహమూర్తినుండి వివరాలు సేకరించారు. దీనిపై నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. ఆయన వెంట తుని సిఐ చెన్నకేశవరావు ఉన్నారు.