తూర్పుగోదావరి

ఈత కోసం వెళ్లి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 18: రాజమహేంద్రవరం పుష్కరాలరేవులో గురువారం మధ్యాహ్నం గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఉదయం ఆట సినిమా చూద్దామని వచ్చిన వారు అప్పటికే ఉదయం ఆట ప్రారంభం కావడంతో సరదాగా ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఎకెసి కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న దివాన్‌చెరువునకు చెందిన యందం వెంకటగణేష్(16), గైట్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన సిగడపు చైతన్య(19) పుష్కరాలరేవులో గోదావరిలో గల్లంతయ్యారు. దివాన్‌చెరువునకు చెందిన ఎన్ శంకర్, షేక్ గాంధీ, సిహెచ్ సతీష్, గల్లంతైన వెంకటగణేష్, చైతన్య పార్ట్‌టైమ్‌గా దాబాలో పనిచేస్తూ స్నేహితులుగా మారారు. గురువారం ఉదయం వీరంతా స్వామి ధియేటర్‌లో సినిమా చూసేందుకు రాజమహేంద్రవరం చేరుకున్నారు. అయితే అప్పటికే ఉదయం ఆట ప్రారంభం కావడంతో వీరంతా మనసు మార్చుకుని పుష్కరాలరేవు వద్దకు సరదాగా ఈతకు వచ్చారు. షేక్ గాంధీ మినహా మిగిలిన నలుగురు గోదావరిలో ఈతకు దిగారు. ఈత రాకపోవడంతో గణేష్, చైతన్యలు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతయ్యారు. కొద్దిసేపటి తరువాత ఒడ్డున ఈతకొడుతున్న మిగిలిన ఇద్దరు స్నేహితులు గణేష్, చైతన్యల గురించి చూడగా వారి జాడ కనిపించలేదు. దీంతో స్థానికంగా ఉన్న జాలర్లను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జాలర్ల సహాయంతో పుష్కరాలరేవులో గల్లంతైన బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగించినా వెంకటగణేష్, చైతన్య జాడ దొరకలేదు. గణేష్‌కు తల్లిదండ్రులు లేరని, అమ్మమ్మ వద్ద ఉంటున్నట్లు తెలిసింది. ఈసంఘటనతో పుష్కరాలరేవు వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. కాగా, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఇద్దరు విద్యార్థులు గోదావరిలో గల్లంతయ్యారని ఆరోపిస్తూ ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో వైరాల అప్పారావు, మృతుల తల్లిదండ్రులు, ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు పుష్కరాలరేవు వద్ద ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గల్లంతైన విద్యార్థులను గాలించడంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. పుష్కరాలరేవులో ప్రమాదకర పరిస్థితులున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని దక్షిణ మండం డిఎస్పీ నారాయణరావు, త్రీటౌన్ సిఐ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావు సందర్శించారు. త్రీటౌన్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.