ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న శుభ వర్తమానాలు ఈ వారంలో అందుతాయి. మీ కృషి, సామర్థ్యాలతో అధికారులను మెప్పిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చురుకైన సహచరులు, అనుయాయులు లభించడం చెప్పుకోదగ్గ విశేషం. 17, 18 తేదీల్లో నూతన కార్యారంభాలు, చర్చలు, సమావేశాలు ఫలించడం ఉంటాయి. భాగస్వామ్యాలు రాణిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీలలో గెలుస్తారు.

వృషభం (మే 15 - జూన్ 14)
అనుకున్నవి సకాలంలో సాగక ఆది, సోమవారాల్లో కొంత జాప్యం జరిగినా పట్టుదలతో లక్ష్య సాధనకై కృషి చేస్తారు. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. కుటుంబ వ్యక్తులు ఇష్టాయిష్టాలను గౌరవించడం ఉత్తమం. అధికారులతో సంయమనంతో మసలుకోవడం ఉపయుక్తం. యంత్ర, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం వల్ల నష్టాలను నివారించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగానే సాగుతాయనవచ్చు.

మిథునం (జూన్ 15 - జూలై 14)
ఆలస్యంగానైనా మీ లక్ష్యాలు నెరవేరుతాయనడంలో సందేహం లేదు. లౌక్యంగా వ్యవహరించి కుటుంబ వ్యక్తుల నుండి సహాయ సహకారాలు పొందడమేకాక, మార్గదర్శకులుగా నిలుస్తారు. అనుకోని బాధ్యతలు మంగళ, బుధవారాల్లో మీ మీద పడటంతో దిన చర్యలలో మార్పులు ఏర్పడవచ్చు. వృత్తి వాణిజ్యాలు మొత్తం మీద మీరనుకున్న విధంగానే నిర్వహించగలుగుతారు. సోదర వర్గంతో బాంధవ్యాలు మెరుగవుతాయి. అలసత్వం ప్రదర్శిస్తే విద్యార్థులు ర్యాంకులు పొందడం కష్టం. మరమ్మతుల ద్వారా యంత్రాలు, ఇతర పరికరాలు వాడుకలోనికి తెస్తారు.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)
నిర్విరామంగా కృషి చేసి మీ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తారు. వాక్చాతుర్యం, నిర్ణయాత్మక శక్తితో ప్రముఖులను, పెద్దలను ఆకట్టుకుంటారు. నూతన విషయాలను అధ్యయనం చేయడం, ఆకళింపు చేసుకోవడం కోసం సమయం వెచ్చిస్తారు. గురు, శుక్రవారాల్లో గృహ సంబంధ విషయాలతో బిజీగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన, యోగాసనాల ద్వారా ఉల్లాసం, మనశ్శాంతి లభ్యమవుతుంది. ద్రవ్య లాభం, ప్రత్యర్థులు బలహీనపడడం జరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
అస్తవ్యస్తంగా సాగుతున్న పనులు ఓ గాడిలో పడుతాయని చెప్పవచ్చు. మీ మీద నమ్మకంతో నూతన బాధ్యతలు అప్పగించబడుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెట్టుబడులు, వాయిదాల చెల్లింపులు ఆలస్యంగానైనా పూర్తి కాగలవు. అధికారుల మద్దతుతో బృహత్తర కార్యాలకు శ్రీకారం చుడతారు. ఏకాగ్ర చిత్తంతో కృషి చేసి విద్యా సాంస్కృతిక రంగాల్లో మీ ప్రాముఖ్యతను పెంపు చేసుకో గలుగుతారు. వివాహ, విదేశీ ప్రయాణాలకు సంబంధించి అనుకూలత గోచరించవచ్చు. రహస్య నివేదికలు అందుతాయి.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
పట్టుదలలకు, పోటీలకు ఇది అనుకూల తరుణం కాదు. ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే అన్ని రంగాలలోనూ విజయం సాధించగలరు. వ్యవధానం లేకుండా పనులు చేయవలసి రావడంతో అలసట పెరుగవచ్చు. ధార్మిక వ్యవహారాల పట్ల ఆసక్తి కలుగుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నత స్థాయిలోని వారికి చలనములు ఏర్పడు సూచనలు అధికం. ఉద్యోగ, వాణిజ్యాలలో ఆటంకాలున్నా పురోగతిని ఆశించవచ్చు.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
ఎవరి సాయం, తోడ్పాటు లేకపోయినా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించ గలుగుతారు. పెద్దల ఆశీర్వాదాలు, మన్ననలు పొందగలుగుతారు. శారీరక రుగ్మతలు తొలగి స్వస్థత చేకూరుతుంది. బంధు మిత్రులతో కలిసి ఆహ్లాదకర ప్రదేశాలు సందర్శిస్తారు. చెప్పుకోదగ్గ మొత్తాల్లో ఆదాయం 17, 18 తేదీల్లో మీ చేతికందవచ్చు. ప్రముఖులతో పరిచయాలు మీ పరపతిని, ఆదాయాన్ని పెంచేవిగా ఉంటాయి. విలువైన వస్త్భ్రారణాలు ఖరీదు చేస్తారనవచ్చు.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
పోటీ ప్రపంచంలో మీ ప్రాధాన్యత నిలుపుకోవడం కోసం అన్ని విధాలా కృషి చేస్తారు. విజ్ఞతతో వ్యవహరించి ఆత్మీయుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తారు. కార్మిక కార్యవర్గంతో వివాదాలు, అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. విద్యార్థుల కోరికలు, అభిమతాలు నెరవేరే సూచనలున్నాయి. ప్రజాహిత కార్యక్రమాలు, సదస్సులు మీరాశించిన విధంగానే నిర్వహించగలగడం చెప్పుకోదగ్గ విశేషం. కుటుంబ వ్యక్తుల అనుమానాలు తీర్చి భవిష్యత్ ప్రణాళికల పట్ల అవగాహన పెంచుతారు.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
మీలో ఉన్న కళాతృష్ణ, వ్యవహార నైపుణ్యం బహిర్గతమయ్యేందుకు తగిన అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు, యంత్రాల కొనుగోలు, నూతన ఒప్పందాలతో వారమంతా చురుగ్గా సాగుతుంది. ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. భూమి, గృహ సంబంధ లావాదేవీలు పునరాలోచించడం శ్రేయస్కరం. దినచర్యలు సంతృప్తికరంగా నిర్వహించ గలుగుతారు. సన్నిహితుల పొరపాట్లను సవరించి వారి భవిష్యత్తుకు గట్టి పునాదులు వేయడానికి ప్రయత్నిస్తారు. ఆదాయం పెరుగుతుంది.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
ఆది, సోమవారాల్లో వ్యవహారాల్లో జాప్యం మీకు అసహనం కలిగించినా తదుపరి వేగం పుంజుకుంటాయి. మేధో మధనం ద్వారా కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కరింపబడతాయి. మీ కార్యదక్షత, సమయస్ఫూర్తితో సహచరులను, సహోద్యోగులను ప్రభావితం చేస్తారు. ఖర్చులకు తగినంత ఆదాయం సమకూర్చుకో గలుగుతారు. ఆత్మీయుల ఆదరణ, ఆహ్వానాలు మీలో ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రక్రియలు, ప్రణాళికల ద్వారా ఫలితాలు సాధిస్తారు.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
మీ అభిప్రాయాలను సన్నిహితులు, సహచరులతో పంచుకుని మనసు తేలిక పరచుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకర అవకాశాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తయ్యేంతవరకు స్వీయ పర్యవేక్షణ ఉండటం ఎంతైనా అవసరం. నియమనిష్ఠలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పెండింగ్‌లో వున్న బిల్లులు, క్లెయిములు అందుకుంటారు. సంగీత సాహిత్య విషయాల పట్ల అభిరుచి పెరుగుతుంది. ఔషధ సేవనంతో ఆరోగ్యం మెరుగవుతుంది.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
వ్యవహారాలన్నీ మీరాశించిన విధంగా జరగడానికి కొంత సమయం పట్టవచ్చు. ముఖ్యమైన లావాదేవీలను బుధవారంలోగా పూర్తి చేయడం ఉత్తమం. ప్రత్యర్థుల గురించి ఆలోచించక మీ ఏకాగ్రత, కృషి మీద ఆధారపడి లక్ష్యాలను నిర్ణయించుకోండి. సర్వీసులు, స్పెక్యులేషన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. శుక్ర, శనివారాల్లో ఇతరుల, సహోదర వర్గం కోసం మీ సమయాన్ని కేటాయించవలసి రావచ్చు. యాంత్రిక లోపాలు తలెత్తవచ్చు. విజ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో మీ ప్రాముఖ్యత ద్విగుణీకృతమవుతుంది.

ఎస్.రవిప్రకాశ్