వరంగల్

ప్రారంభోత్సవానికి సిద్ధ్దమైన కెటిపిపి రెండోదశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు *ఎన్నికల కోడ్‌తో వాయిదా పడుతున్న కార్యక్రమం
పరకాల, నవంబర్ 29: కెటిపిపి 600 మెగావాట్ల రెండో దశ విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తుంది. నూతన సంవత్సరంలో కెటిపిపి రెండో దశ ప్రారంభోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు నెలలుగా వివిధ దశల్లో టయల్ రన్ పూర్తి చేసిన అధికారులు అధికారికంగా సిఎండి ప్రభాకర్‌రావు చేతుల మీదిగా దసరా రోజున 110 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసి విజయవంతం చేశారు. గతంలో బాయిలర్ లైటాప్ విజయవంతం కావడం, ముఖ్య జనరేటర్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, చార్జింగ్ కూడా విజయవంతం పూర్తయ్యాయి. విద్యుత్ ఉత్పత్తికి ముందు సిఎండి ప్రభాకర్‌రావు కెటిపిపిలోనే మకాం వేసి విద్యుత్ ఉత్పత్తి సరళిని అధికారులతో కలిసి పరిశీలించారు. రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్ స్విచ్ అన్‌చేసి ప్రారంభించిన ఆయన 110 మెగావాట్ల వరకు ఉత్పత్తిని తీసుకెళ్లి గ్రిడ్‌కు అనుసంధానం చేసి నిలిపి వేశారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభ సమయంలో ఏలాంటి అవాంతరాలు లేకుండా ప్లాంట్ కొనసాగడంపై అధికారులను ఆయన అభినందిండంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నిక అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదిగా ప్రారంభోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
*ఎన్నికల కోడ్‌తో...
ట్రయల్న్ కూడా విజయవంతం కావడంతో సివోడిపై జెన్‌కో యాజమాన్యం దృష్టి సారించింది. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్బంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో సిఓడి పూర్తి చేసి సిఎం చేతుల మీదిగా రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌ను జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన వెలువడింది. దీంతో మరోసారి ఎన్నికల కోడ్ అముల్లోకి వచ్చింది. 95 శాతం రెండోదశ పనులు పూర్తి చేసుకొని సిఓడి వైపు అధికారులు వేగంగా కదులుతున్నారు. ఇప్పటికే రెండోదశ ప్లాంట్‌లో ఉత్పత్తి రెండేళ్ల పాటు ఆలస్యం కావడంతో పాటు ప్లాంట్ నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిమాండ్ మేరకు కెటిపిపి రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. దీంతో కెటిపిపి 600 మెగావాట్ల ప్లాంట్‌ను నూతన సంవత్సరంలో జాతికి అంకితం చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
*రిజర్వాయర్‌కు గోదావరి జలాలు...
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 600 మెగావాట్లకు సంబందించిన రెండో రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను పంపే ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైనట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వారం రోజులుగా గోదావరి నది నుండి వేసిన పైపు లైన్లకు హైడ్రో పరిక్షలు జరిపి నిటిని వదిలామని అధికారులు తెలిపారు. ఈనెలల్లో కెటిపిపి రెండో దశను ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించడంతో రిజర్వాయర్‌ను నింపుతున్నట్లు వారు తెలిపారు.