సంజీవని

అకారణ జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మీరే డాక్టర్
===========
ప్ర: నాకు ఎప్పుడూ నోట్లో నీరూరుతుంటుంది. వికారంగా వుంటుంది. వాంతి అయితే హాయిగా వుంటుంది. త్రేన్పులు వస్తుంటాయి. గుండెల్లో ఏదో పెట్టినట్లుగా అనిపిస్తుంది. శరీరం బరువుగా, ఒళ్ళంతా నొప్పులుగా జ్వరం వచ్చినట్టే ఉంటుంది. చర్మం మీద ఎర్రని దద్దుర్లు వస్తుంటాయి. ఎంతమందికి చూపించినా ఏమీ లేదంటున్నారు. అన్నం తినకుండా పస్తు ఉన్నా తగ్గటంలేదు. షుగర, బీపి, థైరాయిడ్ నార్మల్‌గానే వున్నాయన్నారు. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించగలరు.
-బెల్లంకొండ ప్రసాద్, మధిర
జ: జఠరాగ్ని మందగించటంవలన మీరు చెప్పిన సమస్యలు వస్తున్నాయి. జీర్ణశక్తి తగ్గిపోవటానికి వేడి చేయటం ముఖ్య కారణం. చింతపండు, అల్లం వెల్లుల్లి, ఊరగాయల్లాంటివి అతిగా తినటంవలన జీర్ణశక్తి తగ్గిపోవటానికి వడి చేయటం ముఖ్య కారణం. చింతపండు, అల్లం వెల్లుల్లి, ఊరగాయల్లాంటివి అతిగా తినటంవలన జీర్ణశక్తి దెబ్బతిని ఈ పరిస్థితి వస్తుంది. ‘ఊష్మాపిత్తాదృతే’ అనే సూత్రం ప్రకారం శరీరంలో వేడి పెరగకుండా జ్వరం రాదు. కాబట్టి జ్వరం ఏ కారణం వలన వస్తున్నా సరే, వేడి చేసే ఆహార విహారాలు మానాలి. కేవలం జ్వరం తగ్గే మందులు వాడుతూ, ఆహార జాగ్రత్తలు పాటించకపోతే, అజీర్తి మరింత పెరుగుతుంది. అందుకని తొందరపడి మందులు వేయవద్దని యోగరత్నాకరం వైద్య గ్రంథంలో సూచించారు. మీ విషయంలో ఇతర కారణాలేవీ లేవని నిర్థారణ అయింది కాబట్టి, మందులు ఆపండి. తేలికగా ఆహారాన్ని చలవచేసే బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, కీరదోస, క్యారెట్, ముల్లంగి, బెండ దొండ లాంటి కూరగాయలన్నీ తీసుకోవచ్చు. బూడిదగుమ్మడిని సొరకాయలాగా వండుకుంటే అమితంగా చలవ చేస్తుంది. అకారణ జ్వరాలను తగ్గిస్తుంది. రుచికి చేదుగా ఉండే పదార్థాలు మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఒక చెంచా మెంతులు నోట్లో వేసుకుని నీళ్ళు తాగే అలవాటు చేసుకుంటే చేదు లోపం వలన కలిగే ఇబ్బందులు ఆగుతాయి. కాకరకాయ కూర, వేప పూల పొడి (చేదు), బాగా చిలికిన మజ్జిగ (వగరు పులవకుండా ఉన్నవి) జ్వరాన్ని తగ్గిస్తాయి. కానీ చింతపండు, అల్లం వెల్లుల్లి తక్కువగా వాడండి.
ఇంగువ 5 గ్రాములు, నేతితో వేపిన అల్లం ముద్ద 10 గ్రాములు, నేతితో వేయించిన మిరియాల పొడి 20 గ్రాములు, జీలకఱ్ఱ 40 గ్రాములు, పసుపుకొమ్ములు దంచిన పొడి 80 గ్రాములు, ధనియాల పొడి 160 గ్రాములు ఈ మోతాదులో తీసుకుని తగినంత ఉప్పు కలిపి వాడుతూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఓకరింతలు, వికారం తగ్గుతాయి. దీన్ని ఇంటిల్లిపాదీ తినవచ్చు. గ్లాసు మజ్జిగలో అరచెంచా నుండి చెంచా పొడిని కలిపి తాగితే జ్వరం నెమ్మదిస్తుంది. వ్యాధులకు తలుపులు తెరిచే అజీర్తిని రాకుండా చేస్తుంది. అనవసరమైన మసాలాలను వదిలేసి ఈ వేసవారం పొడిని కూరల్లో దీన్ని కలుపుకోవటం అందరికీ మంచిది.
ధనియాల పొడినిగానీ, దాల్చినచెక్క పొడినిగాని జీలకర్ర పొడినిగానీ నీటిలో ఏదో ఒక దానిని గ్లాసు నీళ్ళలో అరచెంచా మోతాదులో వేసి బాగా మరగకాచి వడగట్టి, ఆ నీటిని పచ్చి మంచినీళ్ళకు బదులుగా తాగుతూ వుంటే ఈ అకారణ జ్వరం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరిగి, వికారం వగైరా తగ్గిన తరువాత కూడా జ్వరం వస్తుంటే అపుడు ఆ జ్వరానికి తగిన ఔషధాన్ని వాడటం మంచిది. మీరు వ్రాసిన ప్రకారం బహుశా మీకు బయాటిన్ అనే బి విటమిన్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది తక్కువగా ఉండటానికి ఆహారం వొంట బట్టకపోవడమే కారణం. జీర్ణశక్తి సరికాగానే ఆహార పోషకాలు వొంటబట్టి, బి విటమిన్ లోపం సరి అవుతుంది.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com