అదిలాబాద్

గట్టు మల్లన్న జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భక్తులతో నిండిపోయిన మల్లన్న గుట్ట
జైపూర్, మార్చి 7: మండలంలోని వేలాలలోని గట్టు మల్లన్న జాతరకు సోమవారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో మల్లిఖార్జున స్వామి కొలువున్న మల్లన్న గుట్ట భక్తులతో నిండిపోయింది. మహాశివరాత్రి సందర్భంగా తరలి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ప్రభుత్వ విప్ ఓదెలు, పెద్దపల్లి ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లతోపాటు మాజీ మంత్రి వినోద్ స్వామిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, వివసత్తుల పూనకాలు, లక్ష్మిదేవరల విన్యాసాలతో మల్లన్నగుట్ట పులకించి పోయింది. స్వామి దర్శనంకోసం వచ్చిన భక్తులు సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాసాలతో బోనాలుపోసి, పట్నాలువేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సమర్పణ సందర్భంగా ఒగ్గు పూజారుల ఢమరుకాల చప్పుల్లతో మారుమోగింది. శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్ ఆధ్వర్యంలో 200మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గతంతో పోల్చితే ఈ ఏడాది రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యంకల్పించటంతో భక్తులకు ఇబ్బందులుతప్పాయి. ఈరోజు ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న భక్తులు మంగళవారం వేలాల మల్లిఖార్జునుడి దర్శించుకుంటారు.

మార్కెట్ చైర్మన్‌గిరీపై నేతల ఆశలు
* భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గిరికై తీవ్ర పోటీ
భైంసా , మార్చి 7: జిల్లాలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ అయిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరిపై ఆశావాహుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు త్వరలోనే మార్కెట్ కమిటీల్లో చైర్మన్లను భర్తీ చేయనున్న దృష్ట్యా ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముధోల్, తానూర్, లోకేశ్వరం, భైంసా మండల, పట్టణ పరిధిలోని నాయకులు తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు రిజర్వ్‌చేయగా ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తమ ప్రయత్నాలను ముమ్మ రంగా కొనసాగిస్తున్నారు. భైంసా పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎన్నో ఏళ్లుగా గడ్డెన్న కుటుంబాన్ని వెన్నంటి ఉంటున్న డబ్ల్యూ భీంరావు, తానూర్ మండలానికి చెందిన మాజీ జడ్పీటిసి ఉత్తం బాలేరావు, నియోజకవర్గంలోని యువనాయకుడైన వానల్‌పాడ్ శ్రీనివాస్, మరో సీనియర్ దళిత నాయకుడు మైసేకర్ తదితరులు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, వానల్‌పాడ్ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన శ్రీనివాస్ రైతు కుటుంబానికి చెందినవాడు. కాగా, మాజీ జడ్పీటిసి ఉత్తం సైతం విఠల్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. చైర్మన్‌గిరికి పోటీపడుతున్న ఈ నలుగురిలో ఎవరొకొకరికి చైర్మన్ పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. సాయిలు మైసేకర్‌కు సైతం దళిత వర్గాల్లో మంచిపట్టుండగా.. ఎమ్మెల్యేతోపాటు రాష్టస్థ్రాయి నేతలను కలుస్తూ ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో చైర్మన్ స్థానాన్ని భర్తీచేయనున్న నేపథ్యంలో నేతలు శక్తివంచనలేకుండా తమతమ స్థాయలో నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు.