అంతర్జాతీయం

ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంకారా, జూన్ 14: అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ బకర అల్ బాగ్దాదీ అమెరికా వైమానిక దాడుల్లో హతుడైనట్టు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికాలోని ఓర్లాండోలో 50మంది గేలను హతమార్చడం వెనుక తమ హస్తం ఉందంటూ ఐసిస్ ప్రకటించిన నేపథ్యంలో, దాని అధినేతే హతం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కథనాలు నిజమైతే ఐసిస్‌కు చావుదెబ్బేనని భావిస్తున్నారు. రక్కాలో జరిగిన అమెరికా దాడిలో బాగ్దాది మరణించినట్టు టర్కీకి చెందిన యానిస్ సపక్ పత్రిక వెల్లడించింది. అయితే, ఇప్పటి వరకూ బాగ్దాదీ మరణించినట్టు అనేక సందర్భాల్లో కథనాలు వచ్చినా, అవేవీ నిజం కాకపోవడం కూడా గమనార్హం. అయితే, ఈ తాజా ఘటనకు సంబంధించి ఇటు అమెరికానుంచి గానీ, సంకీర్ణ దళాల నుంచి గానీ ఎలాంటి ధ్రువీకరణ లేదు.