అంతర్జాతీయం

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జూన్ 20: వరుస బాంబు పేళ్లులతో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడిలో కాబూల్‌లోని కెనడా ఎంబసీలో పనిచేస్తున్న 14 మంది నేపాల్ భద్రతా సిబ్బంది మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న వాహనంపై ఈ దాడి జరిగింది. దాడి తమపనేనని తాలిబన్ తిరుబాటు సంస్థ ప్రకటించుకుంది. అలాగే దక్షిణ కాబూల్‌లో జరిగిన మరోదాడిలో ఒకరు మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. గాయపడ్డవారిలో ఓ స్థానిక రాజకీయ నాయకుడున్నారు.
ఈశాన్య ప్రాంతమైన బడక్షాన్‌లోని మారుమూలనున్న ఓ మార్కెట్ వద్ద పేలుళ్లు జరిగిన కొద్ది గంటల్లోనే కాబూల్ దాడి ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ వద్ద పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. తాలిబన్లపై వైమానిక దాడులు మరింత పెంచాలని వాషింగ్టన్ నుంచి ప్రకటన వెలువడ్డ తరువాత ఆఫ్గనిస్తాన్‌లో తిరుగుబాటుదారులు మరింత రెచ్చిపోయి హింసకు పాల్పడుతున్నారు. గత నెలలో యుఎస్ ద్రోన్ దాడుల్లో తాలిబన్ కీలక నేతలను కోల్పోయింది. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నేపాల్ భద్రతా సిబ్బందితో వెళ్తున్న వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. పేలుళ్లలో చనిపోయినవారంతా నేపాలీలేనని వారన్నారు.
ఈ దాడిలో తొమ్మిది మంది గాయపడ్డారని వారు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆఫ్గనిస్తాన్‌లోని కెనడా ఎంబసీ ప్రగాఢ సంతాపం తెలిపింది. కాగా పేలుళ్ల శబ్దంతో కాబూల్ నగరం దద్దలిల్లింది. జలాలాబాద్ రహదారి వెంబడి దట్టమైన పొగ కమ్మేసింది. అనేక మంది విదేశీ కంపెనీలు ఆ రోడ్డులోనే ఉన్నాయి. పేలుళ్ల ఘటన తరువాత రహదారిని సీజ్ చేశారు. దాడులు తమపనేనని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా మజుహిదీన్ ప్రకటించాడు. అణచివేతకు ప్రతికారంగానే దాడులు చేసినట్టు సామాజిక మాద్యమాల్లో తెలిపాడు.

కాబూల్‌లో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న దృశ్యం