అంతర్జాతీయం

15 మంది మృతి.. వందల ఇళ్లు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూలై 1: ఉత్తరాఖండ్‌లోని ఎగువ పర్వత ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు వివిధ ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాల్లో కనీసం 15 మంది చనిపోగా, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. పర్వత ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలకు పితోర్‌గఢ్, చమోలీ జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆ జిల్లాల ప్రజలు నానా అ వస్థలు పడుతున్నారు. ధరుచులాప్రాంతంలోని సువా గ్రామంలో వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఈ గ్రామానికి లింక్‌గా ఉండే మూడు వంతెనలు కొట్టుకు పోవడంతో గ్రామానికి బయటి ప్రపంచంతో సంబందాలు తెగిపోయాయి. వరద ప్రాంతాలకు జాతీ య విపత్తు సహాయక బృందాలను హుటాహుటిన పంపిస్తున్నామని, మరిన్ని దళాలను సిద్ధంగా ఉంచామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 54 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. థాల్- ము న్స్యారి రోడ్డు తెగిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్య లో వాహనాలు నిలిచిపోయాయి. ఖరాడి సమీపంలో యమునోత్రి హైవే కూడా దెబ్బతినడంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. గంగోల్‌గావ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డంతో కేదార్‌నాథ్ హైవేపై భారీ వాహనాలు వెళ్లడాన్ని ఆపేశారు. అలకనందతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాబోయే 72 గంటల్లో నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్, చంపావత్, ఆల్మోరా, పౌరి, హరిద్వార్, డెహ్రాడూన్ తేహ్రీ జిల్లాల్లో భారీనుంచి అతి నారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని దృష్ట్యా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా ఆయా జిల్లాల అధికారులను ఆదేశించడం జరిగింది.

చిత్రం...
ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాల కారణంగా శుక్రవారం
పితోర్‌గఢ్ సమీపంలోని సింఘాలి వద్ద దెబ్బతిన్న గృహాలు