అంతర్జాతీయం

జనంపైకి దూసుకెళ్లిన ఉగ్ర శకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీస్ (ఫ్రాన్స్), జూలై 15: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బిస్టల్ డే రక్తసిక్తమైంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఏటేటా జరిగే ఈ జాతీయ దినోత్సవం పెను విషాదంగా మారింది. శుక్రవారం ఫ్రాన్స్ వాహ్యాళి పట్టణమైన నీస్ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఓ ఉగ్రవాది మృత్యు శకటం దూసుకొచ్చి నరమేధం సృష్టించింది. ఈ విషాద ఘటనలో 84మంది మరణించారు. గాయపడ్డ వందలాది మందిలో అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర జనంపై నుంచే ఆ ఉన్మాది దూకసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ వాహనంలో తుపాకులు, భారీ ఆయుధాలు కూడా ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ దాడి జరిగిన నీస్ ప్రాంతమంతా శవాల గుట్టలుగా మారింది. క్షణాల ముందు వరకూ ఆనందోత్సాహాలతో హోరెత్తిన ప్రాంగణం స్మశాన సదృశంగా మారింది. అనేక మంది పిల్లలు సహా వందలాది మంది గాయపడ్డారు. తునీసియాకు చెందిన ఓ వ్యక్తి అమిత వేగంతో ఆయుధాలతో నిండిన ట్రక్కుతో జనంపైకి దూసుకెళ్లడంతో ఈ ఘోర సంఘటన జరిగింది. జనంపైకి దూసుకొస్తున్న ట్రక్కును అడ్డుకునేందుకు దానితో సమానమైన వేగంతో వెళ్లి దాని తలుపులు తీసేందుకు ప్రయత్నించిన ఓ మోటారు సైకిలిస్టు అదే వాహనం చక్రాల కింద పడి దుర్మరణం చెందాడు. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఇద్దరు అమెరికా, ఓ ఉక్రెయిన్ పౌరుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్స వేడుకల అనంతరం బాణ సంచా కాలుస్తూ ప్రజలు తలమునకలైన సమయంలో రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఈ తెల్లటి వాహనం అతి వేగంగా వారిపైకి దూసుకొచ్చిందని సాక్షులు తెలిపారు. ఆ సమయంలో దాదాపు 30వేల మంది అక్కడ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ ఉన్మాద కృత్యానికి పాల్పడ్డ వ్యక్తిని 31 సంవత్సరాలున్న మహమ్మద్ బౌలెల్‌గా గుర్తించారు. జనంపైకి దూసుకొచ్చిన తర్వాత అతడు పోలీసులపై కూడా కాల్పులు జరిపాడని, ఎదురు కాల్పుల్లో హతుడయ్యాడని తెలుస్తోంది. గత ఏడాది జనవరి, నవంబర్‌లలో జరిగిన ఉగ్రవాద దాడుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో జరిగిన ఈ అమానుష దాడి ఫ్రాన్స్ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీన్ని అత్యంత హేయమైన ఉగ్రవాద దాడిగా అభివర్ణించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ మృతులకు సంతాపంగా మూడు రోజుల సంతాప దినాల్ని ప్రకటించారు.

చిత్రం...
సంఘటనా ప్రాంతంలో
భయానక వాతావరణం

ప్రాణాలు తీసిన
ఉగ్ర రాకాసి ట్రక్కు