అంతర్జాతీయం

టర్కీ రెబెల్స్‌పై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, జూలై 19: టర్కీలో ఎర్డోగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆర్మీ, ఇతర ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం కొనసాగుతోంది. తిరుగుబాటుకు కుట్రపన్నిన వారుగా భావిస్తున్న వేలాది మంది అధికారులను అరెస్టు చేసిన ఎర్డోగన్ ప్రభుత్వం మరో 9 వేల మంది అధికారులను బర్తరఫ్ చేసింది. కాగా కుట్ర పన్నిన వ్యక్తిని తాను కాదని, ఎవరు కుట్ర పన్నారో తనకు తెలియదని టర్కీ ఆర్మీ చీఫ్ జనరల్ అకిన్ ఓజ్టుక్ కోర్టులో ప్రాసిక్యూటర్లకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చెప్పినట్లు అధికార వార్తాసంస్థ ‘అనడో’లు తెలిపింది. ఆర్మీ అధికారులను మంగళవారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. తిరుగుబాటుదారులను సమూలంగా తుడిచిపెట్టేదాకా విశ్రమించేది లేదని ఎర్డోగన్ స్పష్టం చేస్తున్నప్పటికీ కుట్రదారులన్న ఆరోపణలపై అరెస్టు చేసిన అధికారులపై పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు అధ్యక్షుడ్ని హెచ్చరించారు.
తిరుగుబాటుకు సంబంధించి 103 మంది ఆర్మీ ఉన్నతాధికారులు సహా 7,500 మందికి పైగా అధికారులను అరెస్టు చేసినట్లు ప్రధాని బినాలి యిల్డిరిమ్ చెప్పారు. 8 వేల మంది పోలీసులు, కొంతమంది మున్సిపల్ గవర్నర్లు, ఇతర అధికారులతో కలుపుకొని మొత్తం 9 వేల మందికి పైగా అధికారులను బర్తరఫ్ చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, తాజా తిరుగుబాటు నేపథ్యంలో టర్కీ ప్రభుత్వం తిరిగి మరణశిక్షను ప్రవేశపెట్టవచ్చన్న భయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాతోపాటుగా ఇతర నాటో దేశాలన్నీ కూడా దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలని టర్కీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సోమవారం ఇయు దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడిన అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ విలేఖరుల సమావేశంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.