అంతర్జాతీయం

టిఎమ్ కృష్ణ, విల్సన్‌లకు మెగసెసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, జూలై 27: ఇద్దరు భారతీయులను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు వరించింది. కర్నాటక సంగీత విద్వాంసుడు టిఎమ్ కృష్ణ (40), జాతీయ సఫారీ కర్మచారి ఆందోళన కన్వీనర్ బెజవాడ విల్సన్ (50)లను 2016 సంవత్సరానికిగాను పురస్కారానికి ఎంపిక చేశారు. సాంస్కృతిక రంగంలో సామాజిక సమీకృతత్వాన్ని పాదుగొల్పినందుకు కృష్ణను, హుందాగా జీవించడమన్నది మానవ జీవనంలో అంతర్భాగమన్న హక్కును నినదించినందుకు బెజవాడ విల్సన్ పురస్కారానికి ఎంపికయ్యారు.
వీరితో పాటు ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్పియో మోర్సల్స్, ఇండోనేసియాకు చెందిన డోమ్‌పెట్ ధుఫా, జపాన్ విదేశీ సహకార స్వచ్చంద కార్యకర్తలు, లావోస్‌కు చెందిన ‘వియెంటియేన్ రెస్క్యూ’ సంస్థ కూడా మెగసెసే అవార్డుకు ఎంపికైంది. ‘వ్యక్తిగత జీవితాల్లోనూ, సమాజంలోనూ కూడా విశేషమైన పరివర్తనను తీసుకొచ్చే శక్తి సంగీతానికి ఉందని టిఎమ్ కృష్ణ నిరూపించారని ఆయన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. అలాగే భారత్‌లో వేళ్లూనుకుని ఉన్న సామాజిక వైరుధ్యాలను కూడా సంగీతం ద్వారా రూపుమాపవచ్చుననీ ఆయన నిరూపించారని తెలిపారు. కర్నాటకలోని ఓ దళిత కుటుంబంలో పుట్టిన బెజవాడ విల్సన్ ‘మానవ సఫారుూ’కి వ్యతిరేకంగా ఉద్యమించారు.