అంతర్జాతీయం

అమెరికాను ఆయన అమ్మేస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడెల్ఫియా, జూలై 29: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ మరోసారి తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మత దురభిమానం, శబ్దాడంబరం గల ట్రంప్‌కు అధ్యక్ష పదవి వంటి ఉన్నతమైన బాధ్యతలను అప్పగించడం అమెరికాకు క్షేమం కాదని ఆమె ఓటర్లను హెచ్చరించారు. తొలి మహిళా అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికయి చరిత్ర సృష్టించిన తాను నిలకడ గల, దృఢమైన నాయకురాలిగా దేశానికి సేవలందిస్తానని చెప్పారు. శుక్రవారం ఇక్కడ ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న, మేటి సైనిక శక్తిగా కొనసాగుతున్న అమెరికా సంఘటిత అభివృద్ధికోసం తన విజన్‌ను ఆమె అమెరికా ప్రజల ముందు ఉంచారు. ఒక విలేఖరి కష్టమైన ప్రశ్న అడిగితే సంయమనం కోల్పోయిన ట్రంప్ నిజమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠిస్తే ఆయన అమెరికాను తాకట్టుపెడతాడని హిల్లరీ క్లింటన్ అన్నారు. ట్రంప్‌కు కమాండర్ ఇన్ చీఫ్ పదవిని నిర్వహించే స్వభావం ఉందా? అని ఆమె ప్రశ్నించారు.
ఆర్థిక వ్యవస్థలో కుదుపులు, హింస, ఉగ్రవాదం వంటి తీవ్రమైన సవాళ్లను అమెరికా ఎదుర్కొంటున్న సమ యం ఇదని ఆమె పేర్కొన్నారు. ‘అమెరికా మరోసారి కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. శక్తివంతమైన శక్తులు మనల్ని పక్కకు లాగుతామని హెచ్చరిస్తున్నాయి. విశ్వాస, గౌరవ బంధాలు ఘర్షణ పడుతున్నాయి. మనమంతా కలిసి ఎదగడానికి మనమంతా కలిసి పనిచేయబోతున్నామా? లేదా? అనేది నిర్ణయించాలి’ అన్ని 68 ఏళ్ల హిల్లరీ క్లింటన్ అన్నారు. కొంతమందికి కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే ఆర్థిక వ్యవస్థను తాను నిర్మించబోతున్నానని ఆమె చెప్పారు. విద్వేషం స్థానంలో ప్రేమ నిండే దేశంగా అమెరికాను తీర్చిదిద్దబోతున్నానన్నారు.
chitram..
తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆనందంతో హిల్లరీ అభివాదం