అంతర్జాతీయం

‘ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 5: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఆమోదించే సమస్యే లేదని హార్వర్డ్ రిపబ్లికన్ క్లబ్ ప్రకటించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేసే హార్వర్డ్ రిపబ్లికన్ పార్టీ 128 సంవత్సరాలలో ఇలా పార్టీ అధికారిక అభ్యర్థిని వ్యతిరేకించడం ఇదే మొదటిసారి. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన జాత్యహంకార, స్ర్తిద్వేష ఉపన్యాసాలను కూడా క్లబ్ ఖండించింది. అమెరికా సైనికులు చేసిన వీరోచిత త్యాగాలను ట్రంప్ తరచుగా తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించింది. అమెరికాలో రిపబ్లికన్ల చరిత్రలో అతి పురాతనమైన సంస్థ అయిన హార్వర్డ్ రిపబ్లికన్ క్లబ్ 70 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడింది. రోనాల్డ్ రీగన్ వంటి నేత అధిష్ఠించిన అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్‌ను ఊహించుకోవడానికే తన సభ్యులు సిగ్గుపడుతున్నారని హార్వర్డ్ రిపబ్లికన్ క్లబ్ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ ఉనికికే ముప్పని పేర్కొంటూ ప్రమాదకరమైన ఆ వ్యక్తికి మద్దతును ఉపసంహరించుకోవాలని రిపబ్లికన్లకు క్లబ్ పిలుపునిచ్చింది. కేవలం వ్యక్తిత్వం, సత్ప్రవర్తన లేకపోవడమే కాదు, అపాయకరమైన ధోరణులు పెరుగుతున్న ప్రపంచంలో అమెరికాను ముందుకు నడిపించేందుకు నేతృత్వం వహించవలసిన అవసరం ఉందంటూ క్లబ్ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
చిన్న విషయాలకే బాధ్యతారహితంగా, దుర్మార్గంగా స్పందించే ట్రంప్ అభ్యర్థిత్వం తనకు సమ్మతం కాబోదని క్లబ్ తెగేసి చెప్పింది. తన విద్వేషపూరిత ప్రసంగాలతో దేశాన్ని, పిల్లలను విషపూరితం చేస్తున్న ట్రంప్‌కు మద్దతును ఉపసంహరించుకోవాలని రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులను కోరుతున్నట్లు క్లబ్ వెల్లడించింది.